Pawan kalyan’s OG: గురూజీని ఓజి సెట్ కి రానివ్వకండి-ఇదెక్కడి మాస్ ట్రోలింగ్ రా మావా

Pawan kalyan’s OG

గురూజీ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటిసారి పవన్ కళ్యాణ్ తో జల్సా సినిమా చేసినప్పటి నుండి, “చెప్పుకు అంటుకున్న బబ్లు గమ్” లా పవన్ కళ్యాణ్ కి అంటుకుపోయాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. గురూజీ పవన్ కళ్యాణ్ కి రెండు హిట్ సినిమాలను ఇచ్చిన విషయం అభిమానులు ఎప్పటికి మర్చిపోలేరు. అలాగే అజ్ఞాతవాసి రూపంలో దించిన గునపాన్ని కూడా ఎప్పటికి మర్చిపోలేరు.

అజ్ఞాతవాసి సినిమా తరువాత కొంత గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ వకీల్ సాబ్ రీ ఎంట్రీ సినిమాతో ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ ను త్రివిక్రమ్ సెట్ చేసాడు అనే విషయం చాలా తక్కువమందికి తెలుసు. ఈ సినిమా అభిమానులను బాగానే ఆకట్టుకుంది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ చేసిన రెండు సినిమాల్లోనూ త్రివిక్రమ్ పైత్యం ఉంది. దీనిని కొంచెం ప్రొఫెషనల్ గా చెప్పాలంటే గురూజీ ఇన్వాల్ మెంట్ ఉంది. ఈ సినిమాలు అంతంత మాత్రమే ఆడాయి.

ఇప్పుడు అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ చేస్తున్న స్ట్రయిట్ ప్రాజెక్ట్ ఓజి. ఫ్యాన్ బాయ్ సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానులుకి మంచి అంచనాలు ఉన్నాయ్. అంచనాలకు తగ్గట్టుగానే పవన్ బర్త్డే కానుకగా రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ సంచలనం సృష్టించింది. పవన్ అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చింది. ఈ తరుణంలో సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ , మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి.

- Advertisement -

ఓజి గ్లిమ్ప్స్ అద్భుతంగా ఉంది. చాలా ఏళ్ళు తరువాత కళ్యాణ్ అభిమానులకు పండగ రాబోతుంది. సుజీత్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. త్రివిక్రమ్ వచ్చి వేలు పెడితే సినిమా నాశనం అయిపోతుంది అనే ఉద్దేశ్యంతో. గురూజీని సెట్ కి రానివ్వకండి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ  ప్రాజెక్ట్ సెట్ చేసింది కూడా గురుజీనే.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు