Karthi’s Japan: పకడ్బందీగా ప్లాన్ చేసిన కార్తీ – జపాన్ లో బిగ్ సప్రైజ్..!

Karthi’s Japan

కార్తీ, రాజు మురుగన్ కాంబినేషన్లో జపాన్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజైన గ్లిమ్ప్స్ లో కార్తీ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ సినిమాలో WWE ఫైటర్స్ సామీ జెన్, కెవిన్ ఓవెన్స్ లు కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఈ మేరకు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే, అది జాపన సినిమా షూటింగా లేక ఏదైనా యాడ్ షూటింగా అన్నది క్లారిటీ లేదు. హైదరాబాద్ లో WWE ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో కార్తీ పలువురు రెస్లర్స్ ని కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
కార్తీ సరసన అను ఇమాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఖైదీ సినిమా తర్వాత కార్తీకి ఆ రేంజ్ లో బ్లాక్ బస్టర్ లేని నేపథ్యంలో ఈ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. ప్రస్తుతం వినిపిస్తున్న వార్త గనక నిజమే అయితే జపాన్ సినిమా రేంజ్ పాన్ వరల్డ్ కి పెరిగే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 30న రిలీజ్ కానున్న ఈ సినిమాలో కార్తి డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తుండటం ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం సౌత్ సినిమాలకు నార్త్ లో డిమాండ్ పెరిగిన నేపథ్యంలో కార్తికి పాన్ ఇండియా హిట్ దక్కుతుందా లేదా అన్నది జపాన్ సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు