Akhil Update: సర్జరీకి సిద్ధమైన అక్కినేని హీరో… ఇక సినిమాలు లేనట్టే?

అక్కినేని నాగార్జున తనయుడిగా అఖిల్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్‌కి ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవడానికి ఒకటి అంటే ఒక్క సినిమా లేదు. అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇది ఆయనకి ఓ పెద్ద డిజాస్టర్ కావడం నాగార్జునకి తలకొట్టేసినట్టు అయింది. ఇక అప్పటి నుండి హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాడు అఖిల్. కానీ ఆయనకు తగిలే దర్శకులు అఖిల్ కష్టానికి ప్రతిఫలం అందించడంలో అడుగడుగునా విఫలమవుతున్నారు.

ఇటీవల వచ్చిన ఏజెంట్ మూవీపై అఖిల్, అక్కినేని ఫ్యామిలీ మాత్రమే కాదు, ఫ్యాన్స్ కూడా భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. రెండేళ్ల పాటు అఖిల్ పడిన కష్టానికి ప్రతిఫలం ఏజెంట్ ఇస్తుందని అనుకున్నారు. కానీ, ఏజెంట్ కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. దీంతో అఖిల్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సినిమా రాలేదు. ఇదంతా పక్కన పెడితే, అఖిల్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అఖిల్ ఫిజిక్ అంతా బాగున్నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లేదనే ఓ విమర్శ ఉంది. ముఖ్యంగా అఖిల్ ముక్కు చాలా బ్రాడ్ గా ఉండటం అనేది పెద్ద మైనస్ అంటూ సినీ క్రిటిక్స్ కూడా అంటున్నారు. దీంతో అఖిల్ తన ముక్కుకు సర్జరీ చేయించుకోవడానికి విదేశాలకు వెళ్లబోతున్నాడు అన్న ప్రచారం జరుగుతుంది. సర్జరీ ఎప్పుడు ఉంటుంది? ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ ఉంటుంది? అనే ప్రశ్నలు అక్కినేని ఫ్యాన్స్ నుంచి వస్తున్నాయి. అలాగే ఇతర ఫ్యాన్స్ నుంచి… సర్జరీతో అయినా ఈ అక్కినేని హీరో తలరాత మారుతుందా అంటూ కామెంట్ వస్తున్నాయి.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు