Vijay’s Leo: లియోపై మళ్లీ ట్రోల్స్… ఇలా అయితే కష్టమే

ఈ ఏడాది దసరాకు వస్తున్న లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాల్లో హిట్ అవ్వడానికి లియో చిత్రానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సినీ విమర్శకుల నుంచి సాధారణ ప్రేక్షకుల వరకు అందరూ అంచనా వేస్తున్నారు. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలపై కూడా అంచనాలు ఉన్నాయి. కానీ, వీటిలో బెటర్ ఆప్షన్ లియో అనే చెబుతున్నారు. అంటే లియో సినిమాకు పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే ఈ పాజిటివ్ వైబ్స్ రిలీజ్ డేట్ వచ్చే వరకు ఉంటాయా? అనేది ప్రస్తుతం చర్చ. ఎందుకంటే, లియో సినిమాపై ఉన్న అంచనాలు రోజు రోజుకు తగ్గుతున్నాయి. పోస్టర్లు, ట్రైలర్ వల్ల సినిమాకు చాలా నష్టం జరిగింది. తాజాగా తెలుగు వెర్షన్ లో నే రేడీ … అంటూ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ రిలీక్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఏదీ కూడా ఇంప్రెస్ చేసేలా లేవు. అనిరుధ్ రవిచంద్రన్ స్టైల్ అసలు కనిపించడం లేదు.

ఇప్పటికే తమిళ సాంగ్ విన్న తెలుగు ఆడియన్స్… ఈ నే రేడీ తెలుగు వెర్షెన్ సాంగ్ ను ఏ మాత్రం తీసుకోవడం లేదు. సినిమా స్టోరీ ఎంత బాగా ఉన్నా.. పాటలు ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోతే ఫలితంపై గట్టి ప్రభావమే పడుతుంది. అయితే నే రేడీ తెలుగు వెర్షన్ పాట విన్న తర్వాత తెలుగు ప్రేక్షకుల నుంచి ఓ కొత్త డిమాండ్ వస్తుంది. థియేటర్స్ లో తెలుగు వెర్షన్ పాటలు కాకుండా, అనిరుధ్ మ్యూజిక్ అందించిన తమిళ పాటలనే వేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుడులో డబ్ చేసిన సినిమాకు తమిళ పాటలు వేయడం కొత్తగా ఉన్నా.. ఇలా చేస్తనే ఈ దసరా పోటీలో విజయ్ దళపలి నిలుస్తాడు అని చెప్పొచ్చు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు