LEO Movie: లోకేష్ కొత్త ప్రయోగం… మూవీ స్టార్టింగ్‌లోనే బిగ్ ట్విస్ట్?

“లియో సినిమాలో మొదటి 10 నిమిషాలు చాలా కీలకం. ఎవరూ కూడా మొదటి పది నిమిషాలను మిస్ చేయొద్దు” డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలివి. అంతే కాదు, లియో సినిమాలో ఓ కొత్త ప్రయోగం చేశామని, అది ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుందని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ పది నిమిషాల కోసం వేల మంది కష్టపడ్డామని, దాని రిజెల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుందని చెప్పుకొచ్చారు.

అయితే లోకేష్ ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది ఇప్పుడు కోలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీల్లో చర్చ సాగుతుంది. కోలీవుడ్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం… లియో మూవీలో స్టార్టింగ్ లోనే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఓ భారీ ట్విస్ట్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ ప్రయోగం ఏంటంటే…? సినిమా ప్రారంభంలోనే ఓ భారీ ఫైట్ సీన్ ఉంటుందట. ఫైట్ సీన్ అంటే.. మామూలు ఫైట్ కాదు.. ఏకంగా క్లైమాక్స్ ఫైట్ నే సినిమా స్టార్టింగ్ లో వచ్చేలా స్క్రీన్ ప్లే ప్లాన్ చేశాడట లోకేష్. ప్రారంభంలో వచ్చే క్లైమాక్స్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని తెలుస్తుంది. ఇక సినిమా చివరలో మరో ట్విస్ట్ ఇచ్చి LCUకి లింక్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

- Advertisement -

నిజానికి సినిమా ప్రారంభంలోనే క్లైమాక్స్ సీన్ పెట్టేసి… ఫ్లాష బ్యాక్ తో సినిమాలు రన్ చేయడం కొత్తేమీ కాదు. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో ఇలాంటివి కనిపించాయి. కానీ, క్లైమాక్స్ మొత్తం చూపించలేదు. అయితే ఇప్పుడు లోకేష్ ఇప్పుడు లియో సినిమాతో స్టార్టింగ్ లోనే క్లైమాక్స్ మొత్తం చూపించాలని అనుకున్నాడట. అందుకోసం లియో టీం మొత్తం బాగానే కష్టపడ్డారని కోలీవుడ్ లో టాక్.

ఇదే కనుక నిజం అయితే, సినిమా ఇండస్ట్రీలో లోకేష్ కొత్త విధానానికి నాంది పలికినట్టే అని చెప్పొచ్చు. ఇలా మూవీ స్టార్టింగ్ లోనే క్లైమాక్స్ పెట్టడంతో ఆడియన్స్ ప్రారంభం నుంచే మూవీతో పాటు ప్రయాణిస్తారు. డైరెక్టర్ ఏం చెప్పాలని అనుకున్నాడో… దాన్ని క్లారిటీగా చెప్పగలడు. అలాగే సినిమా స్వరూపమే మారొచ్చు కూడా.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు