Lokesh Kanagaraj : లియో లో ఆ సీన్ షూటింగ్ సమయంలో లోకేష్ కనకరాజ్ కన్నీళ్లు పెట్టుకున్నడట..

దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా లియో పై ప్రేక్షకుల్లో ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే మోస్ట్ యాన్టిస్పెటెడ్ ఇండియన్ సినిమా అని చెప్పవచ్చు.

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలనే లోకేష్ కనకరాజ్ ఒక ఇంటర్వ్యూలో చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నిన్న మొన్నటి వరకు ట్రెండ్ అవ్వగా.. ఇక లేటెస్ట్ గా లియో సినిమా డైలాగ్ రైటర్ రత్న కుమార్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను ఇంటర్వ్యూలో తెలుపగా.. ప్రస్తుతం ఆ న్యూస్ నెట్ లో వైరల్ గా మారింది.

అదేంటంటే లియో సినిమా షూటింగ్ సమయంలో హీరో విజయ్ తో ఒక సీన్ షూట్ చేస్తున్నప్పుడు లోకేష్ కనకరాజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడట. విజయ్ పర్ఫామెన్స్ చూసి భావోద్వేగానికి లోనైనా లోకేష్ కట్ చెప్పడం కూడా మర్చిపోయాడట. అయితే ఆ సినిమా మరేదో కాదు ట్రైలర్ లో విజయ్ ఫ్యామిలీ జోలికి ఎవరో వస్తున్నారని చెప్పిన డైలాగ్ సీన్ నేనని ఆయన చెప్పుకొచ్చాడు.

- Advertisement -

కొద్దీ రోజుల క్రితమే రిలీజైన లియో సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి కారణం అందరు లియో సినిమాలో పంచ్ డైలాగ్స్, అదిరిపోయే ఫైట్స్ ఉంటాయని భావించారు. కానీ లోకేష్ కనకరాజ్ తన సినిమాటిక్ బ్రిలియన్స్ వాడి అందరి ఆలోచనలకు భిన్నంగా ఉండేలా లియో ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్అందరికి ఎక్కలేదు. ఇక అక్టోబర్ 19 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతున్న లియో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుందని సమాచారం.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు