VIDHI: ఈ తెలుగమ్మాయి కెరీర్ ఇంతేనా?

VIDHI:

టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత చాలా ఉందని ఎప్పుడూ వార్తలు వస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే హీరోయిన్లు ఉంటారు గాని, ఇక్కడ టాలెంట్ కి వ్యాల్యూ లేదు. ఓపెన్ గా చెప్పాలంటే తెలుగు హీరోయిన్లకి గుర్తింపు లేదు అని కొంతమంది తెలుగు హీరోయిన్లు అంటుంటారు. అలా మంచి టాలెంట్ ఉండి అవకాశాల కోసం ఇంకా ఎదురు చూస్తున్న హీరోయిన్లలో “ఆనంది” ఒకరు. ఈ హీరోయిన్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి పదేళ్ల పైనే అయినా ఇప్పటికీ సక్సెస్ కాలేకపోతుంది.

అందుకే కొన్నాళ్ళు తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. అక్కడ రెండు మూడు మంచి సినిమాలతో సక్సెస్ కొట్టినప్పటికీ, ఆ తర్వాత అవకాశాల్లేక ఇక్కడికే వచ్చేసింది. ఇక్కడ జాంబీ రెడ్డి అనే సినిమాతో హిట్ కొట్టినా అది తన కెరీర్ కి పెద్దగా ఉపయోగపడలేదు.

చివరగా లాస్ట్ ఇయర్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం తో పలకరించగా, మళ్ళీ ఇన్నాళ్లకు “విధి” అనే సినిమాతో ఆడియన్స్ ని అలరించడానికి వస్తుంది.

- Advertisement -

తెలుగులో ఈ ఒక్క సినిమాయే తన చేతిలో ఉండగా, తమిళ్ లో మరో సినిమా చేస్తుంది. విధి సినిమా సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా కాగా, నవంబర్ లో రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమాతో నైనా హిట్టు కొట్టి, పెద్ద సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటుందా అన్నది చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు