Tollywood: భగవంత్ కేసరి మూవీ శ్రీ లీల కెరీర్ కి చాలా ప్లస్ అవుతుందా?

Tollywood:

యంగ్& టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒక చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ సినిమాతో పది సినిమా ఆఫర్లు కొట్టేసిన టాలెంటెడ్ హీరోయిన్ ఈ ముద్దుగుమ్మ. బెంగుళూర్ కి చెందిన ఈ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుగువాళ్లే కావడం వల్ల తెలుగు అనర్గళంగా మాట్లాడగలదు. ఆ ప్లస్ పాయింట్ తోనే వరుస ఆఫర్లు దక్కించుకున్న శ్రీ లీల ప్రస్తుతం ఏ హీరోయిన్ లేనంత బిజీగా ఉంది.

ఇక ఈ హీరోయిన్ నటిస్తున్న సినిమాల్లో భగవంత్ కేసరి కూడా ఒకటి. అయితే అందులో బాలకృష్ణ కూతురిగా నటించిందన్న సంగతి తెలిసిందే. హీరోయిన్ గా కాజల్ యాక్ట్ చేసింది. అయితే ఇండీస్ట్రీ లో చెల్లి, కూతురు పాత్రలు చేస్తే ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు రావడం తగ్గిపోతాయని కొందరి అభిప్రాయం. అలా కొంత మందికి జరిగింది కూడా.

అయితే ఇదే విషయం ఓ ఇంటర్వ్యూ లో శ్రీ లీలని అడిగితే, నాకు పాత్ర నచ్చింది కాబట్టి చేశాను, ఈ సినిమా నా కెరీర్ కి ప్లస్ అవుతుంది కానీ మైనస్ కాదు. గ్లామర్ ఛాన్స్ లు ఎప్పటికి వస్తాయి, కానీ యాక్టింగ్ కి స్కోప్ ఉన్న మూవీ ఛాన్స్ లు వచ్చినప్పుడు వదిలేయకూడదు అని చెప్పింది.

- Advertisement -

ఇక తాజాగా భగవంత్ కేసరి ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, ఆ సినిమాలో కాజల్ కంటే కూడా శ్రీ లీలకే స్క్రీన్ స్పేస్ ఎక్కువ దక్కిందని తెలుస్తుంది. మరి శ్రీ లీల కెరీర్ కి భగవంత్ కేసరి సినిమా ఎంత వరకు ప్లస్ అవుతుందో రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు