Biggboss season 7: అంబటి అర్జున్ వైల్డ్ ఎంట్రీ!

Biggboss season 7:

స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ లు ఎంట్రీ ఇస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కంటెస్టెంట్స్ లో ఎవరెవరు ఏ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్స్ తో ఎంట్రీ ఇస్తున్నారనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ వైల్డ్ కార్డు ఎంట్రీ లో ఫస్ట్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన వ్యక్తి అంబటి అర్జున్. ఇతను ఒక సీరియల్ ఆక్టర్ గా తెలుగు ఆడియన్స్ కి సుపరిచితుడే.

మాటీవీ లో అగ్ని సాక్షి అనే సీరియల్ ద్వారా ఫేమస్ అయిన అర్జున్ కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. ఇక బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తూనే నాగార్జునతో పెద్ద బాంబేసాడు. తన అసలు పేరు అంబటి నాగార్జున అని, కానీ అందరూ అర్జున్ అని పిలవడం వల్ల అలాగే ఫేమస్ అయ్యాయని చెప్పుకొచ్చాడు. ఇక బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తూనే తాను బిగ్ బాస్ ఎపిసోడ్స్ అన్నీ చూశానని హౌస్ మేట్స్ అందరి గురించి ఒక ఐడియా వచ్చిందని అన్నాడు.

అయితే తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఆడియన్స్ ఇవ్వరని అంటూనే, తాను అది మార్చి చూపిస్తానని అన్నాడు. ఇక అంబటి అర్జున్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూనే హౌస్ లో ఎవరు ఎలాంటి గేమ్ ఆడుతున్నారో చెప్పేసాడు. యావర్, ప్రశాంత్ చాలా దమ్ముగా ఆడుతున్నారని చెప్పాడు. ముఖ్యంగా ఫిజకల్ టాస్కుల్లో యావర్ చాలా స్ట్రాంగ్ అని అర్జున్ అన్నాడు.

- Advertisement -

ఇక అమర్, సందీప్.. దుమ్ముదుమ్ముగా ఆడుతున్నారని అర్జున్ చెప్పాడు. అయితే అమర్ ఇలా ఆడతాడని అసలు ఊహించలేదని అర్జున్ బాంబు పేల్చాడు. నిజానికి అర్జున్.. అమర్ మంచి ఫ్రెండ్స్.. కానీ ఆట విషయానికొస్తే ఉన్నదున్నట్టు నిజాలు చెప్పేశాడు అంబటి. మరి హౌస్ లో తన పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని ఎలా ఎట్రాక్ట్ చేస్తాడో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు