Captain Miller: కెప్టెన్ మిల్లర్ కోసం నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్..!

హీరో ధనుష్, డైరెక్టర్ అరుణ్ మహేశ్వరన్ కాంబినేషన్లో కెప్టెన్ మిల్లర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 15న రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమా గురించి వస్తున్న న్యూస్ సినిమా మీద అంచనాలను పెంచుతున్నాయి.

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా ఉంటుందని సమాచారం అందుతోంది. శివరాజ్ కుమార్, ప్రియాంక మోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అరువి ఫేమ్ అదితి బాలన్ కూడా మరో ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తోందట.

అయితే, అదితి బాలన్ క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ లోనే ఎక్కువగా ఉంటుందని సమాచారం. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో అదితి క్యారెక్టర్ ఫ్రీడమ్ మూమెంట్ బ్యాక్డ్రాప్ లో ఉండనుందట. జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ త్వరలోనే రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

- Advertisement -

తీరు, సార్ లాంటి సాఫ్ట్ టచ్ ఉన్న సినిమాల తర్వాత పూర్తి డిఫరెంట్ లుక్స్ తో ధనుష్ నటించిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ సహా నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బ్రిటిష్ పై పోరాడే వారియర్ క్యారెక్టర్లో ధనుష్ కనిపిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందా లేదా చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు