Lokesh Kanagaraj : లియో సినిమా ఈ రేంజ్ లో రిలీజ్ అవబోతుందా ? తలపతి విజయ్ మాస్ జాతరే ఇక

ప్రస్తుతం ఇండియాలో ఉన్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న లియో సినిమా ఒకటి. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మాస్టర్ సినిమా సంచలన విజయం సాధించటంతో ఈ కాంబోకి నెక్స్ట్ లెవెల్ క్రేజ్ వచ్చింది.

ఇక డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ విషయానికొస్తే సందీప్ కిషన్ హీరోగా నటించిన మానగరం సినిమాతో తమిళ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచమైన లోకేష్, మొదటి సినిమాతోనే కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఈ సినిమాని తెలుగులో నగరం పేరుతో డబ్ చేయగా, తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత లోకేష్ కనకరాజ్ కార్తీ హీరోగా ఖైదీ సినిమా చేసాడు. ఇక ఈ సినిమాతో లోకేష్ రేంజే మారిపోయింది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత లోకేష్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్, విక్రమ్ సినిమాలు కూడా కోలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచి, లోకేష్ కనకరాజ్ ని ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ని చేసాయి.

ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ తలపతి విజయ్ తో కలిసి లియో సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో లోకేష్, ఆయన విక్రమ్ సినిమాలో ఇంట్రడ్యూస్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ ప్రాపర్ గా ప్రెసెంట్ చేయబోతుండటంతో, అంతకంతకు సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకున్న మేకర్స్, లియో సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. యూఎస్ లో దాదాపు 3000 థియేటర్స్ ఉండగా, లియో సినిమాని 1500 థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తురట. ఈ రేంజ్ లో యూఎస్ లో ఒక ఇండియన్ సినిమా రిలీజ్ అవ్వడం ఇదే మొదటిసారని అనుకుంటున్నారు. తలపతి విజయ్ కూడా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఉండటంతో ఈ రిలీజ్ ఖాయమేనని ప్రొడ్యూసర్ లలిత్ కుమార్ ఒక ఇంటర్యూలో వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా లియో సినిమా అక్టోబర్19న రిలీజ్ అవబోతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు