Allu arjun : అల్లు శిరీష్ లో ఈ యాంగిల్ కూడా ఉందని అస్సలు ఊహించలేదు ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా, అల్లు శిరీష్ టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా లాంచ్ అయ్యే ఎవరికైన మొదటి సినిమా అనేది చాలా కీలకం. అందుకే ఏ యంగ్ హీరో అయిన మొదటి సినిమా కోసం లవ్ స్టోరీస్ చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తాడు.

అయితే అల్లు శిరీష్ మాత్రం ఈ లెక్కలేవి వేసుకోకుండా మనసుకి నచ్చింది చేయాలనే ఉద్దేశ్యంతో, గౌరవం అనే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు.కె రాధామోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంశలు అందుకుంది తప్ప కమర్షియల్ గా విజయం సాధించలేకపోయింది. ఆ తరువాత అల్లు శిరీష్ మారుతీ దర్శకత్వంలో కొత్త జంట అనే సినిమాలో నటించాడు. లో-బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా ఒక మోస్తరు విజయాన్ని సాధించింది. కానీ అల్లు శిరీష్ కి మాత్రం ఆశించినంత గుర్తిపు రాలేదు. దాంతో శిరీష్ పర్ఫామెన్స్ కి ప్రాధాన్యత ఉండే పాత్రలు చేయాలనుకొని శ్రీరస్తు శుభమస్తు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. పరుశరాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్నే సాధించింది.

ఆ తరువాత శిరీష్ ఒక్క క్షణం, ఎబిసిడి, ఉర్వశివో రాక్షసివో సినిమాలలో నటించాడు. ఈ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పరవాలేదనిపించిన , శిరీష్ కి మాత్రం యాక్టర్ గుర్తిపు తెచ్చి పెట్టలేకపోయాయి. దాంతో శిరీష్ తో సినిమా చేయడానికి కూడా ఎవరు తగినంత ఆసక్తి చూపించట్లేదు.

- Advertisement -

ప్రస్తుతం శిరీష్ టెడ్డి నేపథ్యంలో కొత్త వాళ్ళతో కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి వివరాలు ఏమి ఇంకా బయటికి రాలేదు. కానీ శిరీష్ ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటి నుంచే స్టార్ చేసినట్టు తెల్సుతోంది. అయితే ఈ సినిమా టెడ్డి నేపథ్యంలో ఉండబోతుండటంతో శిరీష్ సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్లందరికీ టెడ్డీలను గిఫ్ట్ గా పంపిస్తున్నాడు. ఎవరు పంపిస్తున్నారో తెలియని వాళ్లంతా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. గతంలో ఎప్పుడు ఇలా బెహేవ్ చేయని శిరీష్ ఇలా ప్రవర్తిస్తుండటంతో శిరీష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అని అంత ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈరోజు శిరీష్ పుట్టిన రోజు సందర్బంగా ఈ మిస్టరీని రివీల్ చేయబోతున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి సినిమాకి సంబంధించి గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేయబోతున్నట్టు శిరీష్ సోషల్ మీడియా ద్వారా ప్రకంటించాడు. మరి రాబోయే ఈ సినిమాతోనైన శిరీష్ తనకంటూ ఒక గుర్తింపు తెచుకుంటాడో లేదో.. చూడాలి

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు