Balakrishna: భగవంత్ కేసరి సినిమా అనిల్ రావిపూడి కి ఉన్న ఆ మచ్చను తొలగిస్తుందా ?

నందమూరి బాలకృష్ణ , యువ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోతున్న భగవంత్ కేసరి సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్ని అంచనాలున్నాయో తెలిసిందే. శ్రీలీల ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. షైన్ స్క్రీన్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి.

అయితే ఈ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి తన లేటెస్ట్ ఇంటర్వ్యూలలో భగవంత్ కేసరి సినిమా గురించి మాట్లాడుతూ.. బాలయ్యను ఇంతకు ముందు ఎవరు చూపించని విధంగా చూపించమని చెబుతూ వస్తున్నాడు. అలాగే ఎప్పుడు కథ గురించి గాని కథనం గురించి గాని ఎక్కువగా మాట్లాడని అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సినిమా విషయంలో మాత్రం ఎక్కువ కథ గురించే మాట్లాడుతుండటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే అనిల్ రావిపూడి లో వచ్చిన ఈ సడన్ మార్పుకు కారణం ఏంటనేది చూస్తే.. ప్రేక్షకుల్లో తనకున్న క్రింజ్ డైరెక్టర్ అనే పేరును తొలగించుకోవాలనే ప్రయత్నం చేస్తునట్టు తెలుస్తుంది.

ఇప్పటి వరకు అనిల్ రావిపూడి తీసిన సినిమాలే ఆరు సినిమాలే అయినప్పటికీ అవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాయి. అయితే అనిల్ డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ కమర్షియల్ గా మంచి విజయాన్నే సాధించినప్పటికీ ప్రేక్షకుల్లో మాత్రం క్రింజ్ డైరెక్టర్ ముద్ర పడిపోయింది. దీనికి కారణం లాజిక్స్ ఏమి లేకుండా చౌక బారు హాస్యంతో ఎదో విధంగా అనిల్ రావిపూడి సినిమాను చుట్టేయడమే. ఇక ఈ కారణంగా అనిల్ రావిపూడికి క్రింజ్ డైరెక్టర్ అనే పేరు వచ్చింది. ఇక భగవంత్ కేసరి సినిమాతో ఎలాగైనా ఆ పేరును మార్చికుని తాను కూడా ఒక సీరియస్ ఫిలిం మేకర్ అనే పేరును తెచ్చుకోవడానికి అనిల్ రావిపూడి ప్రయత్నిస్తున్నట్టు అర్థం అవుతోంది. మరి అనిల్ రావిపూడి ఆశిస్తున్నట్టుగానే ఆయనకున్న ఆ మచ్చ తొలిగిపోతుందో లేదో చూడాలంటే మరికొద్దీ రోజులు ఆగాల్సిందే.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు