Unstoppable With NBK: అన్ స్టాపబుల్ కాదు – బావ కోసం క్యాంపెయిన్..!

బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 3 త్వరలోనే స్టార్ట్ కానుంది. ఫస్ట్ 2 సీజన్స్ గ్రాండ్ సక్సెస్ అవ్వటమే కాకుండా బాలకృష్ణ మీద ఉన్న ఇంప్రెషన్ ని కూడా మార్చేసి మార్కెట్ కూడా ఇంప్రూవ్ అయ్యేలా చేసింది. ఈ సీజన్ బాలకృష్ణ, అనిల్ అరవిపూడి డైరెక్షన్లో రూపొంది రిలీజ్ కి రెడీగా ఉన్న భగవంత్ కేసరి సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూతో స్టార్ట్ కానుంది.

అంతే కాకుండా ప్రస్తుతం ఏపీలో రాజకీయపరంగా నెలకొన్న హాయ్ డ్రామా నేపథ్యంలో కూడా ఈ షో ప్లాన్ చేసే అవకాశం కనిపిస్తోంది. గతంలో సీజన్2 లో కూడా చంద్రబాబు,లోకేష్ ఈ షోకి అటెండ్ అయ్యి టీడీపీ విషయంలో, ముఖ్యంగా చంద్రబాబుపై ఉన్న ప్రచారం నిజం కాదని ప్రొజెక్ట్ అయ్యేలాగా ప్లాన్ చేశారు.

ప్రస్తుతం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో టీడీపీ క్యాడర్ మాత్రమే కాకుండా బాలకృష్ణ, లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి కూడా తరచూ ఎదో ఎదో నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో భువనేశ్వరి, బ్రాహ్మణిలు ఈసారి షోకి అటెండ్ అయ్యి తమ వాయిస్ వినిపించే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -

ఆ మధ్య ఈ సీజన్లో చిరంజీవి, కేసీఆర్ వంటి ప్రముఖులు షోకి అటెండ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్ కేవలం భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్, చంద్రబాబుకి సపోర్ట్ గా మాత్రమే ప్లాన్ చేశారని తెలుస్తోంది. మరి ఫస్ట్ రెండు సీజన్స్ తో గ్రాండ్ సక్సెస్ అందుకున్న బాలయ్య సీజన్ 3తో హ్యాట్రిక్ కొడతాడా లేదా అన్నది చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు