Kuda Bux: ‘ది మ్యాన్ విత్ ఎక్స్ రే ఐస్’ గురించి సంచలన నిజాలు

‘కుడా బక్స్’ : ‘ది మ్యాన్ విత్ ఎక్స్ రే ఐస్’…

కుడా బక్స్.. ఈ పేరు విన్న వాళ్ళు చాలా తక్కువ. కానీ ఈ వ్యక్తి వరల్డ్ ఫేమస్. ఇతను చేసేవన్నీ అద్భుతాలే. అయితే ఇతనెవరో డాక్టరో, ఇంజనీరో కాదు. సైంటిస్టో, ఆర్టిస్టో కాదు. ఒక ‘మాయ ఇంద్రజాలికుడు’. సింపుల్ గా వాడుక భాషలో చెప్పాలంటే ఒక ‘మెజీషియన్’.

అదేంటి మెజీషియన్స్ ఎంతో మంది ఉంటారు. దేశ విదేశాల్లో పేరొందిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇతనిలో పెద్ద ప్రత్యేకత ఏముంది అంటారా? మామూలుగా మెజీషియన్ ఏ మ్యాజిక్ చేసినా తన చూపు దృష్టిని కేంద్రీకరించి బుద్ధి బలంతో మ్యాజిక్ చేస్తాడు. కానీ కుడా బక్స్ తన కళ్ళకి గంతలు కట్టుకుని మ్యాజిక్ షో చేస్తాడు. అది ఎలాంటిదైనా, ఎంత ప్రమాదమైనా సరే ప్రేక్షకులని సమ్మోహితుల్ని చేయడమే అతని లక్ష్యం.

- Advertisement -

ఉదాహరణకి మాములుగా జనాలు రద్దీగా ఉండే స్ట్రీట్ లో సైకిల్ తొక్కడం ఈజీ నే. కానీ అదే వ్యక్తి కి కళ్ళకి గంతలు కట్టి, ముక్కు రంధ్రాలు మాత్రమే వదిలి, మొహం మొత్తం ప్యాక్ చేసి అప్పుడు సైకిల్ తొక్కితే, అది నిజంగా ఒక అద్భుతమని చెప్పాలి. ఇలాంటి అద్భుత సాహసాలెన్నో చేసిన ఇంద్రజాలికుడు కుడా బక్స్. ఈ షో చేశాకే కుడా బక్స్ “ది మ్యాన్ విత్ ఎక్స్ రే ఐస్” అన్న పేరు తెచ్చి పెట్టింది. ఈ సాహసాలన్నీ అతని జీవిత పుస్తకంలో ఒక పేజీ మాత్రమే.

కుడా బక్స్ ఒక ఇండియన్:

అయితే వరల్డ్ ఫేమస్ మెజీషియన్ అయిన కుడా బక్స్ ఒక భారతీయుడిని చాలా మందికి తెలీదు. కాశ్మీర్ కి చెందిన ఇతడు 1905 ఫిబ్రవరి 17న అఖ్నూర్‌లో ఒక జాతి కాశ్మీరీ కుటుంబంలో జన్మించాడు.. అతని తండ్రి రైల్వే టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. అయితే తనకి యుక్త వయసు వచ్చాక పాకిస్తాన్ పౌరసత్వం పొందాడు.

అయితే 1930ల మధ్యలో అతని 13ఏళ్ళ వయసులో ప్రసిద్ధ ఇంద్రజాలికుడు ‘ప్రొఫెసర్ మూర్’ నుండి మ్యాజిక్ నేర్చుకోవడానికి బయలుదేరాడు. యునైటెడ్ స్టేట్స్‌కు కి వెళ్లి అక్కడ మ్యాజిక్ చేయడం అభ్యసించాడు. ఇక ఆ తర్వాత హరిద్వార్ లో బెనర్జీని కలుసుకున్నాడు. ఇతను కుడా బక్స్ కి అగ్ని నడక, మరియు కళ్ళు లేకుండా చూడటం వంటి విద్యలు నేర్పిన యోగి.

ఇక 1935 లో ఇంగ్లాండ్ వెళ్లిన బక్స్ అక్కడ చాలా ఫేమ్ సంపాదించాడు. బక్స్ వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ ప్రజలు భారత్ నుండి వచ్చే మెజిషియన్స్ పై ఎంతో ఆసక్తి చూపించేవారు. కొందరైతే ఇండియా ని ఇంద్రజాలికుల దేశంగా భావించేవారు. అయితే ఇండియన్ మెజీషియన్స్ ఎక్కువగా ఇతర దేశాల ప్రజల ఇంట్రెస్ట్ ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు. వాళ్లలో బక్స్ ముందుండే వాడు.

ఘోస్ట్ హంటర్ ఎంట్రీ:

అయితే బక్స్ లైఫ్ టర్న్ అయింది మాత్రం ‘ఘోస్ట్ హంటర్ ఎంట్రీ’తో..
బ్రిటన్ కి చెందిన ప్రముఖ ఘోస్ట్ హంటర్ “హ్యారీ ప్రైస్” ఎక్స్ రే చూపు ఉన్న బక్స్ సామర్థ్యాన్ని పరీక్షించాలని, 1935 లో బ్రిటన్ లోని కొంతమంది వైద్యులతో కలిసి నిర్ణయించుకున్నారు. అక్కడ సర్జికల్ బ్యాండ్, టేప్ తో కూడిన నల్లని పత్తి దూదితో బక్స్ కళ్ళకి గంతలు కట్టి ఓ బుక్ చదవమన్నారు. కళ్ళకు గంతలు ఉన్నా కూడా బక్స్ సునాయాసంగా చదివాడు.

ఫైర్ వాకింగ్:

దీని తర్వాత 1935 లోనే హ్యారీ మరో పరీక్ష బక్స్ కి పెట్టారు. ఇది బక్స్ యూరప్ అంతా ఫేమస్ అయ్యేలా చేసింది. ఆ పరీక్షే “ఫైర్ వాకింగ్”. ఆప్పటి యూరప్ లో సర్రే గ్రామీణ ప్రాంతంలో బక్స్ ఫైర్ వాకింగ్ చేయడం ఆరోజుల్లో సంచలనం గా మారింది. ఆ ప్రదర్శనని వీక్షించడానికి ఎంతో మంది వైద్యులు, సైకాలజిస్ట్ లు, జర్నలిస్ట్ లు వచ్చారు. ఆ ప్రదర్శనకి ముందు డాక్టర్లు బక్స్ కాళ్ళని కూడా పరీక్ష చేసారు.

అక్కడ బొగ్గు, కలప, పారఫిన్ వంటి వాటితో హ్యారీ తయారు చేయించిన నిప్పులగుండంపై బక్స్ ఒకసారి కాదు నాలుగుసార్లు నడిచాడు. అయినా కూడా బక్స్ కాళ్లపై కనీసం బొబ్బలు కూడా రాలేదు. ఆ తర్వాత 9 రోజులకి మళ్ళీ ఉక్కును కరిగించేంత వేడిగా ఉన్న నిప్పుల గుండంపై మళ్ళీ నడిచాడు. ఈ టెక్నిక్ తాను యుక్త వయసులో ఉన్నపుడు ఓ యోగ గురు వద్ద నేర్చుకున్నానని చెప్పాడు.

 

అయితే బక్స్ సామర్థ్యాలను అనుమానించిన వాళ్ళు ఉన్నారు. బక్స్ చేసిన కొన్ని షోలను గమనించిన పరిశోధకురాలు కైట్లి రేని మిల్లర్ అయన తన ముక్కు పక్క భాగం నుండి చూస్తున్నాడని కొందరు ఆరోపించారని అన్నారు. ఇలాంటి వేవి పట్టించుకోని కుడా బక్స్ తన పని తాను చూసుకునే వారు. ఇక కుడా బక్స్ అప్పట్లో కుడా బక్స్, హిందూ మిస్టిక్ అనే టెలివిజన్ ప్రోగ్రాం కూడా నడిపేవారు.

ఇక బక్స్ 1981 ఫిబ్రవరి 5న కాలిఫోర్నియా లోని, లాస్ ఏంజిల్స్ లో మరణించారు. తన చివరి రోజుల్లో మ్యాజిక్ కాజిల్ లో మెజిషియన్స్ తో కార్డ్స్ ఆడుతూ గడిపారు. ఇక లేటెస్ట్ గా కుడా బక్స్ జీవిత కథ ఆధారంగా 1977 లో రోల్డ్ డాల్ రాసిన పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని, సినిమా కూడా తీశారు. “ది వండర్ ఫుల్ స్టోరీ అఫ్ హెన్రీ షుగర్” పేరుతో నెట్ ఫ్లిక్స్ లో సినిమా రిలీజ్ అయింది. వెస్ ఆండర్సన్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు