Bheema: ఈ ‘సుత్తి’ గోలేంటి గురూ..?

టాలీవుడ్ లో ఈ మధ్య కాపీ ల ట్రెండ్ బాగా ముదిరింది. ఒకప్పుడు రీమేక్ సినిమాలు ఎక్కువగా చేసేవారు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇన్స్పైర్ పేరుతో కాపీ చేయడం మొదలుపెట్టారు. ఇక రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి వాళ్ళు సీన్లు కాపీ కొడితే, బోయపాటి లాంటి కొందరు డైరెక్టర్లు కత్తిని, సుత్తిని కూడా వదలకుండా కాస్ట్యూమ్స్ తో సహా కాపీ కొడుతున్నారు.

ఇక ఆ మధ్యన బాలకృష్ణ చాలా సినిమాల్లో పలు రకాల గొడ్డలి డిజైన్లు సీన్లు కాపీ చేయడం, గొడ్డలి ని కూడా అదే పనిగా వాడడం చూసాం. ఇక మహేష్ బాబు, ఎన్టీఆర్ చాలా సినిమాల్లో రాయల సీమ కత్తిని వాడడం చూసాం. ఇక ఈ మధ్య సుత్తి ని కూడా వదలడం లేదు మేకర్స్. కొన్నాళ్ల కింద కెజిఎఫ్ లో యష్ సుత్తితో ఫైట్ చేసే సీన్ ఉంటుంది. ఆ సినిమాలో అది చాలా ఫేమస్ అయింది. ఇక ఆ తర్వాత బాలయ్య భగవంత్ కేసరిలో ఇంటర్వెల్ ఫైట్ లో సుత్తిని వాడడం జరిగింది. అయితే ఈ సారి కొంచెం కొత్తగా నట్లతో బిగించిన సుత్తిని వాడారు మేకర్స్.

అయితే లేటెస్ట్ గా గోపిచంద్ కొత్త సినిమాలో భగవంత్ కేసరి లో సుత్తి ని కాపీ కొట్టి, అదే రకంగా ఉన్న సుత్తిని డిజైన్ చేసి సినిమాలో వాడుతున్నారు మేకర్స్. లేటెస్ట్ గా భీమా నుండి రిలీజ్ చేసిన పోస్టర్ లో ఆ సుత్తిని పట్టుకుని గోపిచంద్ ఉన్న లుక్ స్టిల్ ఉంటుంది. అయితే కాపీ అంటే కొద్దీ వరకు ఒకే.. గాని సుత్తిని కూడా మక్కికి మక్కీ దించడమేంటి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక క్రియేటివిటీ ఏం చూపిస్తారు వీళ్ళు అని నెటిజన్లు అంటున్నారు. పోస్టర్ లో గోపీచంద్ లుక్స్ పరంగా ఎంత ఆకట్టుకున్నా ఆ సుత్తి మాత్రం ట్రోలర్ల కంట పడింది. ఇదే ఒక టాప్ హీరో సినిమాలో కాపీ కొట్టుంటే ఎంత ఫ్యాన్స్ ఎంత ట్రోల్ చేసేవారో.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు