Tyson naidu: “టైసన్ నాయుడు” వచ్చేస్తున్నాడు.. గ్లింప్స్ వైరల్..!!

Tyson naidu: టాలీవుడ్ యంగ్ హీరోలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎప్పుడు కూడా విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.. మాస్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ నటుడు యాక్టింగ్ పరంగా ఎంతో కష్టపడుతున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోతున్నారు. గడచిన కొన్ని నెలల క్రితం హిందీలో చత్రపతి సినిమాని రీమిక్స్ చేసి భారీ డిజాస్టర్ ని మూట కట్టుకున్నారు. దీంతో సాయి శ్రీనివాస్ తెలుగు తెరకు సినిమాల పరంగా విరామం ఇచ్చి మూడు సంవత్సరాలు కావస్తోంది.

ఇప్పుడు తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.. డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ లో రూపొందిస్తున్న చిత్రం టైసన్ నాయుడు.. ఈ సినిమాతో మరొకసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది.ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకం పైన నిర్మిస్తున్నారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరియర్ లో ఈ సినిమా 10వ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మరొకసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు బెల్లంకొండ.. గతంలో డైరెక్టర్ సాగర్ కే చంద్ర, పవన్ కళ్యాణ్ తో కలిసి బీమ్లా నాయక్ సినిమాని తెరకెక్కించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు.. ఈ చిన్న గ్లింప్స్ చూస్తూ ఉంటే కచ్చితంగా ఈ సినిమాతో భారీ విజయాన్ని కొట్టబోతున్నట్లు అర్థమవుతోంది.

- Advertisement -

ముఖ్యంగా ఇందులోని డైలాగులు కూడా అందరిలో ఆసక్తి కలిగించేలా కనిపిస్తున్నాయి.. అలాగే సాయి శ్రీనివాస్ ఇందులో బాక్సర్ గా కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.. గ్లింప్స్ తోనే దుమ్ము లేపుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరి ఈ చిత్రంతోనైనా విజయాన్ని అందుకుంటారేమో చూడాలి మరి. ఈ చిత్రానికి సంబంధించి ఇంకా రిలీజ్ డేట్ విషయాన్ని తెలియజేయలేదు చిత్ర బృందం. ఏది ఏమైనా టైసన్ నాయుడు గ్లింప్స్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు