Actress Malavika Mohanan తెలుగు సినిమాలు చేసే ఛాన్సే లేదు అంటున్న మలయాళ కుట్టి

బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి సినిమాలు వచ్చిన తర్వాత తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఎలా మారిపోయిందో అందరికీ తెలుసు. బాలీవుడ్ నుంచి మాత్రమే కాదు, హాలీవుడ్ వాళ్లు కూడా తెలుగులో సినిమాలు చేయడానికి వస్తున్నారు. కానీ మలయాళ కుట్టి.. మాళవిక మోహనన్ మాత్రం తెలుగు సినిమాలు చేసే ఛాన్సే లేదు అని చెబుతుందట.

Read More: Malavika Mohanan: సౌత్ ఇండస్ట్రీ హాట్ బ్యూటీ ఏంటి ఇలా మారిపోయింది?

నిజానికి మాళవిక మోహనన్ ఇప్పటి వరకు డైరెక్ట్ గా ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. అయినా, తెలుగులో ఆమెకు ఫాలోవర్స్ ఉన్నారంటే… ఆమె ఇతర భాషల్లో నటించిన సినిమాలు తెలుగు డబ్ అయ్యాయి కాబట్టి. అయితే డబ్ అయిన సినిమాలతోనే తెలుగులో ఫాలోవర్స్ ను సంపాదించుకుంటే.. డైరెక్ట్ సినిమాలు చేస్తే తెలుగులో మాళవికకు మంచి కెరీర్ ఉంటుంది. కానీ, ఈ మలయాళ కుట్టి మాత్రం ఎన్నీ తెలుగు సినిమాల ఛాన్స్ లు వచ్చినా అన్నింటినీ రిజెక్ట్ చేస్తుందట.

- Advertisement -

ఈమె ప్రస్తుతం తెలుగులో మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తుంది. ఈ బ్యూటీ హోప్స్ అన్నీ కూడా ఈ సినిమాపైనే ఉన్నాయట. ఈ సినిమా హిట్ అయిన తర్వాత తన క్రేజ్ మరింత పెరుగుతుందని, రెమ్యునరేషన్ భారీగా అడగవచ్చు అని ప్లాన్ వేస్తుందట. ప్రభాస్, మారుతి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఒక తెలుగు సినిమాకు కూడా సైన్ చేయనని ఫిక్స్ అయిందట. గత కొన్ని రోజుల నుంచి కొంత మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు.. స్టోరీలు తీసుకుని మాళవిక వద్దకు వస్తే డైరెక్ట్ తెలుగులో ఇప్పుడు చేయలేను అని చెప్పేస్తుందట. కొంత మందికీ మరీ ఎక్కువ రెమ్యునరేషన్ చెప్పి రిజెక్ట్ చేసేలా చేస్తుందట.

Read More: Malavika Mohanan: 500 కోట్లు పెట్టి.. తీసినా అలాంటి సినిమాలు చేయను ?

దీని తెలిసిన వాళ్లు విభిన్నంగా స్పందిస్తున్న ఇండస్ట్రీలో వచ్చిన ప్రతీ అవకాశాన్ని తీసుకువాలని, అలా కాకుండా, వేరే దానిపై ఆధారపడితే, ఏదైనా జరగొచ్చు అని చెబుతున్నారు. అంటే.. మారుతి, ప్రభాస్ మూవీ హిట్ అయితే, తెలుగులో మాళవిక కు మంచి డిమాండే ఉంటుంది. కానీ, ఆ.. సినిమాకు పొరపాటున చేదు ఫలితం వస్తే.. మంచి అవకాశాలను మిస్ చేసుకునట్టే కదా… అని కామెంట్స్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు