Rave Party Movie on OTT : టాలీవుడ్ లో రేవ్ పార్టీ రచ్చ… రేవ్ పార్టీ అంటే ఏంటో తెలిపే ఈ మూవీని ఉందని తెలుసా?

Rave Party Movie on OTT : గత రెండు రోజుల నుంచి టాలీవుడ్ లో రేవ్ పార్టీ రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా రేవ్ పార్టీ వార్తలు మార్మోగిపోతున్నాయి. రీసెంట్ గా బెంగళూరు వేదికగా ఒక రేవ్ పార్టీ జరిగిందని బెంగళూరు పోలీసులు షాకింగ్ విషయాలను బయట పెట్టారు. అందులో పలువురు రాజకీయ ప్రముఖులను, మోడల్స్ ను, సినీ ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. ఇక పార్టీలో పాల్గొన్న సెలబ్రిటీల పేర్లను ఇప్పటికే పోలీసులు బయట పెట్టేశారు. అయితే కొంతమంది అవన్నీ ఫేక్ న్యూస్ అని కొట్టి పారేస్తుంటే, పోలీసులు డ్రగ్ టెస్ట్ రిజల్ట్ తో సహా వారి బండారాలను బయట పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రేవ్ పార్టీ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి? దీనికి సంబంధించిన సినిమా ఒకటి అందుబాటులో ఉందని తెలుసా మీకు? మరి ఆ సినిమా ఏంటి? ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళితే..

రేవ్ పార్టీ అంటే ఏంటీ ?

ప్రస్తుతం రేవ్ పార్టీ గురించిన వార్తలే ఎక్కడ చూసినా వినిపిస్తూ ఉండడంతో ఆ పార్టీని నిర్వహించిన వారెవరు? ఎవరెవరు హాజరయ్యారు? అసలు ఆ రేవ్ పార్టీ కల్చర్ ఏంటి? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నారు నెటిజెన్లు. అయితే రేవ్ పార్టీ అంటే హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు గుట్ట చప్పుడు కాకుండా చేసుకునే ఓ పార్టీ. అందుకే దీని గురించి సామాన్య జనాలకు పెద్దగా తెలియదనే చెప్పాలి. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఓటిటిలో ఉన్న ఈ మూవీపై లుక్కెయ్యాల్సిందే.

Critics At Large : Neglected Gem #41: Groove (2000)

- Advertisement -

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు గ్రూవ్. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రేవ్ పార్టీ కల్చర్ అంటే ఏంటి అనే విషయాన్ని చాలా క్లారిటీగా చూపించారు. అసలు ఈ పార్టీని ఎవరు నిర్వహిస్తారు? ఎవరెవరు హాజరవుతారు? అందులో ఏం చేస్తారు అనే విషయాలను స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు మేకర్స్. అలాగే పార్టీలో లేజర్ లైట్స్ తో డాన్స్ ఫ్లోర్, మంచి మ్యూజిక్, తాగిన వాళ్లకు తాగినంత మందు దొరుకుతాయి. అంతేకాకుండా ఇలాంటి పార్టీలు డ్రగ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక ఈ సినిమా ప్రకారం చూసుకుంటే ఆ పార్టీలో హద్దులు దాటే శృంగారం, న్యూడిటి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం రేవు పార్టీ గురించి జోరుగా వార్తలు వస్తుండడంతో ఓటిటిలో ఈ మూవీ ఉందన్న విషయం బయటకు వచ్చింది.

ఈ మూవీని ఫ్రీగా చూడలేరు…

ఇంకెందుకు ఆలస్యం గ్రూప్ మూవీని చూసి ఈ రేవ్ పార్టీ ఎలా ఉంటుందో తెలుసుకుందామని ఆరాటపడుతున్నారా? అయితే కాస్త ఆగండి. ఈ మూవీని ఫ్రీగా చూడలేరు. సబ్స్క్రిప్షన్ ఉన్నప్పటికీ రెంట్ బేసిస్ మీద అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అవైలబుల్ గా ఉంది. కాబట్టి మూవీని చూడాలంటే అమెజాన్ ప్రైమ్ పెట్టిన రెంట్ ను చెల్లించాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు