Love Me Trailer: సినిమాపై అంచనాలను పెంచుతున్న “లవ్ మీ”

Love Me Trailer:  ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లవ్ మీ.
దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వస్తున్న రెండవ సినిమా ఇది. ఈ సినిమాపై అందరికి మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు ఆకట్టుకుంటుంది. అయితే టీజర్ ఫంక్షన్ లో వైష్ణవి చైతన్య చెప్పినట్లు హీరో దెయ్యంతో ప్రేమలో పడటం ఈ సినిమాలో మనం చూడొచ్చు.

Love Me Movie

ట్రైలర్ టాక్

ఈ సినిమాలో ఆశిష్ క్యారెక్టర్ ను చాలా డిఫరెంట్ గా దర్శకుడు డిజైన్ చేశాడు దర్శకుడు. ఎప్పుడూ నలుపు దుస్తులు వేసుకునే వాడిలా, కాళ్ళకు చెప్పులు కూడా వేయకుండా ఉండే ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఈ సినిమాలో హీరోది. తాను దెయ్యం ఉన్న ప్లేస్ కి వెళ్లి అక్కడ దయ్యంతో లవ్ లో పడతాడు. అయితే హీరోకు బేసిగ్గా ఎమోషన్స్ ఉండవు అని ఒక డైలాగ్ కు సమాధానంగా ఒక దయ్యంతో ప్రేమలో పడ్డాడు అంటే అంతకుమించిన ఎమోషనల్ కాండిడేట్ ఎవరు ఉంటారు.? అంటూ అడగడం కూడా కొంచెం ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు ఈ సినిమాతో ఏదో కొత్త పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అనిపిస్తుంది. చనిపోయిన తర్వాత కూడా ఒక వ్యక్తిని లవ్ చేయొచ్చు అంటూ ఈ సినిమాతో చెప్పే ప్రయత్నం చేసినట్లు ఉన్నాడు దర్శకుడు.

- Advertisement -

ఈ సినిమా మే 25న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించాడు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ట్యాగ్ లైన్. ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచవ్యాప్తంగా మే 25న రిలీజ్ చేస్తున్నారు. కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు