SathyaRaj Comments on PM Modi : మోడీ విధానాలకు నేను వ్యతిరేకం… ఆయన బయోపిక్ చచ్చినా చేయను

SathyaRaj Comments on PM Modi : ప్రముఖ నటుడు సత్యరాజ్‌ ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటిస్తున్నారనే వార్తలు బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై స్పందించిన సత్యరాజ్ ఈ రూమర్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. చచ్చినా మోడీ బయోపిక్ చేయను అంటూ తేల్చి పారేశారు. ఇంతకీ మోడీ బయోపిక్ లో ప్రధాన పాత్ర పోషించబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలపై సత్యరాజ్ స్పందన ఏంటంటే..

పుకార్లపై స్పందించిన సత్యరాజ్

‘బాహుబలి’ సినిమాలలో కట్టప్ప పాత్రలో నటించిన ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్‌ ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటిస్తున్నారని వస్తున్న పుకార్లపై స్పందించారు. తాజాగా మిన్నంబళం అనే తమిళ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ పుకార్లను కొట్టిపారేసిన సత్యరాజ్, అది తనకు కూడా తెలియని వార్తేనని చెప్పాడు. మే 18న నికిల్ మురుకన్ అనే ప్రచారకర్త తన ట్విట్టర్ పేజీలో సత్యరాజ్ పిఎం మోడీ బయోపిక్‌లో నటించబోతున్నాడు అని షేర్ చేసినప్పటి నుంచి ఈ వార్తా వైరల్ అవుతోంది.

బుద్ధిలేని పుకార్లు అంటూ ఫైర్

తాజా ఇంటర్వ్యూలో సత్యరాజ్ మాట్లాడుతూ ‘ప్రధాని మోదీ బయోపిక్‌లో నేను నటిస్తున్నాననే వార్త నాకు కూడా తెలియని వార్తే. ఆ సినిమాలో పీఎం మోదీగా నటించమని ఎవరూ నన్ను సంప్రదించలేదు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఒకప్పుడు వార్తా పత్రికల్లో ‘యువతి హత్య…అక్రమ సంబంధమే కారణమా?’ వంటి కథనాలు వచ్చేవి. అలాగే సోషల్ మీడియా ఇప్పుడు ఇలాంటి బుద్ధిలేని పుకార్లకు వేదికగా మారింది” అంటూ ఫైర్ అయ్యారు సత్యరాజ్.

- Advertisement -

Sathyaraj on playing PM Modi in a biopic - Telugu News - IndiaGlitz.com

మోడీ విధానాలకు వ్యతిరేకం

తాను పెరియర్ రామస్వామి ఫాలోవర్ అని చెప్పిన సత్యరాజ్ అలాంటిది మోడీ బయోపిక్ ఎలా చేస్తానని అన్నాడు. తాను మోడీ విధానాలకు వ్యతిరేకమని, ఒక వేళ మోడీ బయోపిక్ ఆఫర్ వచ్చినా చేయను అని ముఖం మీదే కుండబద్ధలు కొట్టినట్టుగా చెప్పేశారు. గతంలో కూడా ఆయన పెరియారిస్ట్ వ్యతిరేక సిద్ధాంతాలను ప్రచారం చేసే సినిమాలో తాను భాగం కానని చెప్పాడు.

మోడీగా బాలీవుడ్ స్టార్

గతంలో వివేక్ ఒబెరాయ్ మోడీ పాత్రలో తెరపై కన్పించారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పిఎం మోడీ బయోపిక్‌లో ఆయన నటించాడు. కానీ ఈ సినిమాకు థియేటర్లలో ఆశించిన రెస్పాన్స్ రాలేదు. ప్రస్తుతం లోక్ సభ ఎలెక్షన్ హడావిడి నడుస్తుండడంతో మరోసారి ఆయన బయోపిక్ వార్తలు తెరపైకి వచ్చాయి. అందులో భాగంగానే సత్యరాజ్ మోడీగా నటిస్తాడని ప్రచారం జరిగింది. కానీ సత్యరాజ్ అవన్నీ పుకార్లే అంటూ ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు.

సత్యరాజ్ సినిమాలు..

సత్యరాజ్ తాను నటించిన కొత్త తమిళ చిత్రం ‘వెపన్’ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. వసంత్ రవి, రాజీవ్ మీనన్ కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్ మానవాతీతుడిగా నటిస్తున్నాడు. మే 23న ‘వెపన్’ థియేటర్లలో విడుదల కానుంది. అంటే ఈ మూవీ ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు