10 Year’s for Manam : ఈ మూవీకి ఫస్ట్ ఆప్షన్ అక్కినేని ఫ్యామిలీ కాదు… మరి ఎవరంటే…?

10 Year’s for Manam.. అక్కినేని హీరోల కెరియర్ లోనే కాదు తెలుగు సినిమాలలో కూడా మనం సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అని చెప్పవచ్చు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలవడంతో పాటు మంచి లాభాలను కూడా సొంతం చేసుకుంది. ఇక అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా కావడంతో పాటు ఈ సినిమాలో కథ, కథనం అన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయి.. ఈ మూవీ కథనంలో వచ్చే ట్విస్ట్ లు ప్రేక్షకులను మరింత ఆశ్చర్యాలకు గురిచేస్తాయనడంలో సందేహం లేదు. మనం సినిమా తమ కెరియర్ లో స్పెషల్ మూవీ అని ఇప్పటికే నాగార్జున కూడా ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు.. అలా అక్కినేని ఫ్యామిలీకి మనం సినిమా అంకితం అని చెప్పడంలో సందేహం లేదు ఈ సినిమా కోసం చాలా కుటుంబాలు ప్రయత్నం చేసినా.. ఈ రేంజ్ లో సినిమా తెరకెక్కిస్తారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉంటాయి.. అంతలా ఈ ఫ్యామిలీ కోసమే ఈ సినిమాని రూపొందించారు అని అందరూ అనుకుంటూ ఉంటారు… వాస్తవానికి ముందుగా ఈ సినిమాను అక్కినేని కుటుంబంతో తీయాలని అనుకోలేదట డైరెక్టర్ విక్రమ్ కే కుమార్..

ముందుగా అనుకున్నది వారినే..

మొదటగా సిద్ధార్థ, వెంకటేష్ , కె. విశ్వనాథ్ లతో కలిసి మనం సినిమాని తెరకెక్కించాలని అనుకున్నారు విక్రమ్ కే కుమార్ . వీరికి తగ్గట్టుగానే సినిమా కథను కూడా రూపొందించారు.. కానీ కొన్ని కారణాల వల్ల చివర్లో ఈ సినిమా కథ అక్కినేని కుటుంబం వద్దకు చేరిపోయింది.. అలా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొని క్లాసిక్ మూవీ గా విజయాన్ని దక్కించుకుంది.

10 Years for Manam Movie
10 Years for Manam Movie

మనం సినిమాకు జీవం పోశారు…

ఇకపోతే ఈ సినిమా విడుదలై 10 సంవత్సరాలు అవుతున్నా.. ఈ సినిమాను రీమేక్ చేసే సాహసం అయితే ఎవరు చేయలేదు. ఈ సినిమా కథ కేవలం అక్కినేని ఫ్యామిలీ కోసమే పుట్టిందని.. అక్కినేని హీరోల మాత్రమే ఈ సినిమాకు జీవం పోసారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తం అవుతూ ఉంటాయి. ఇక ఇందులో సమంత, శ్రియాలకు కూడా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకి భవిష్యత్తులో సీక్వెల్ దిశగా అడుగులు పడాలని కూడా అభిమానులు భావిస్తున్నారు.. ఒకవేళ మనం సినిమాకి గనక సీక్వెల్ వస్తే అభిమానుల సంతోషానికి అవధులు ఉండవని చెప్పడంలో సందేహం లేదు..

- Advertisement -

మనం తర్వాత అక్కినేని హీరోల పరిస్థితి..

ఇకపోతే మనం సినిమా తర్వాత అక్కినేని హీరోల పరిస్థితి ఎలా ఉంది అంటే.. అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్ బారినపడి మరణించగా.. ప్రస్తుతం అక్కినేని నాగార్జున మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తూ ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 13 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషకం అందుకుంటున్నారు. అలాగే అక్కినేని నాగచైతన్య సినిమాకి కూడా రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. ఇక అక్కినేని అఖిల్ కి మాత్రం కెరియర్ పరంగా బిగ్గెస్ట్ హిట్ దక్కాల్సి ఉంది..మొత్తానికైతే అక్కినేని యంగ్ హీరోలు మళ్లీ భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రావాలని.. ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు