Hema on Drugs case : హేమ డ్రగ్స్ తీసుకుంది… సాక్షాలతో ప్రూవ్ అయింది..

Hema on Drugs case : ప్రముఖ నటి హేమ కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో దొరికిన విషయం తెలిసిందే. అయితే ఈమె తాను అక్కడ లేనని బుకాయించే ప్రయత్నం చేసింది. అంతేకాదు ఆ మరుసటిరోజే ఆమె బిర్యాని వండుతున్న వీడియోని కూడా వదిలింది. అయితే ఇక్కడ ఉన్నది హేమ నే అంటూ బెంగళూరు పోలీసులు కూడా సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో నిరూపించారు.. అయిన ఆమె ఈ విషయాన్ని అంగీకరించలేదు.. అయితే ఈ రేవ్ పార్టీలో ఇప్పుడు కీలక పరిణామం చోటుచేసుకుంది .. ఈ పార్టీలో పట్టుబడ్డ 150 మంది రక్త నమూనాలను నార్కోటిక్స్ టీం సేకరించగా.. 57 మంది పురుషులు , 27 మంది మహిళల రక్త నమూనాలలో డ్రగ్స్ ని గుర్తించారు.. ఇకపోతే నటి హేమ రక్త నమూనాలో కూడా డ్రగ్స్ ఆనవాల్లను గుర్తించినట్లు నార్కోటిక్ టీమ్ వెల్లడించింది..

Hema on Drugs case : Hema took drugs... Proved with evidence..
Hema on Drugs case : Hema took drugs… Proved with evidence..

రెండు రోజుల్లో వస్తాను అందరి తాటా తీస్తాను అంటూ చెప్పి ఇప్పుడు అడ్డంగా బుక్ అయింది హేమ..మరి రెండు రోజుల్లో ఈమె మీడియా ముందుకు వచ్చి ఎలాంటి విషయాలు చెబుతుందో చూడాలి..

ఇక అసలు విషయానికే వస్తే.. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జి ఆర్ ఫామ్ హౌస్ లో బర్తడే పార్టీ పేరిట రేవ్ పార్టీ జరిగిన విషయం తెలిసిందే.. అయితే ఇక్కడ డ్రగ్ తో పాటు కొకైన్ ని కూడా తీసుకుంటున్నట్లు వార్తలు అందడంతో పోలీసులు అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ఈ రేవ్ పార్టీపై దాడి చేశారు. దీంతో పలువురు సినీ తారలు , రాజకీయ నాయకులు , యువత బయటపడినట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఈ పార్టీలో ఆంధ్ర కర్ణాటక కు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ పార్టీలో నటి హేమ కూడా పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు.అంతేకాదు ఈ విషయంపై మీడియా ఛానల్లో కూడా వైరల్ అవ్వడంతో నటి హేమ తాను అసలు అక్కడ లేనని.. తాను హైదరాబాదులో ఉన్నానని ఒకరోజు వీడియో చేసి వదలగా. మరుసటి రోజు తాను బిర్యాని చేస్తున్నాను అని చెప్పింది.

- Advertisement -

ఆ తర్వాత తాను తన ఫామ్ హౌస్ లోనే ఉన్నానంటూ చెప్పింది. దీంతో స్పందించిన పోలీసులు ఆమె ఇక్కడే ఉందని సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో సహా నిరూపించారు. అయినా సరే ఆమె మళ్ళీ మీడియా ముందుకు వచ్చి రెండు రోజుల్లోనే అందరి సంగతి తేలుస్తాను. ఎవరు చేయిస్తున్నారు? దీని వెనుక ఎవరు ఉన్నారు? అందరి తాటా తీస్తా అంటూ చెప్పింది. కానీ ఇంతలోనే ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త నమూనాల ద్వారా బయటపడటంతో అడ్డంగా బుక్ అయిపోయింది. మరి ఈ విషయంపై హేమ ఏ విధంగా స్పందిస్తుందో అని ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. మరి డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది.. తదుపరి ఏం జరుగుతుందో చూడాలి. మరొకవైపు కరాటే కళ్యాణి కూడా హేమా ఫేక్ అంటూ ఒక వీడియో వదిలిన విషయం తెలిసింది ఇప్పుడు అందరూ కరాటే కళ్యాణి చెప్పింది నిజమే.. హేమ డ్రగ్స్ తీసుకొని నాటకాలు ఆడుతుంది అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు