21 Years for Nijam: ఈ హింసలు కంటే ఆ జయం, నిజం లే బాగున్నాయి , ఆ తేజ ఏమయ్యారు ఇప్పుడు

21 Years for Nijam: కొన్ని సినిమాలు ఎప్పుడు ఎలాంటి విజయం సాధిస్తాయో ఎవరో ఊహించలేరు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగులుతాయి. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం చూపిస్తాయి. అయితే కొన్ని సినిమాలు కొన్ని సంవత్సరాలు తర్వాత చూసినా కూడా అరే ఇంత మంచి సినిమా ఎందుకు ప్లాప్ అయింది అనే ఫీలింగ్ కలుగుతుంది. లేకపోతే అలా మహేష్ బాబు కెరియర్ లో ఉన్న సినిమా నిజం.

తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం

ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. మహేష్ బాబు లోని సంపూర్ణమైన నటుడిని బయటకు తీశారు ఈ సినిమాతో తేజ. ఇకపోతే ఒక్కడు అనే సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వడం వలన ఈ సినిమా అంతగా ఆడలేదు . ఒక్కడు సినిమా మహేష్ బాబు కెరియర్ లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓబుల్ రెడ్డి అనే ఫ్యాక్షనిస్ట్ తో ఒక కబడ్డీ ప్లేయర్ ఎలా ఆడుకున్నాడు అని సినిమాలో చూపించడంతో మహేష్ బాబుకి విపరీతమైన స్టార్ డం వచ్చింది. ఇకపోతే అప్పటికే దర్శకుడుగా తేజ మంచి ఫామ్ లో ఉన్నాడు. నితిన్ తో జయం అనే ఒక హిట్ సినిమా కూడా కొట్టాడు. అప్పటికి తేజ డైరెక్షన్లో ఒక్కడు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ బాబు చేస్తున్నాడు అంటే అంచనాలు బీభత్సంగా పెరిగిపోయాయి.

Nijam Movie

- Advertisement -

ఇక నిజం కథ విషయానికి వస్తే

సిద్ధా రెడ్డి (జయప్రకాష్ రెడ్డి) ఒక మాఫియా నాయకుడు. అతని కుడిభుజం దేవుడు (గోపీచంద్). దేవుడి మల్లి (రాశి) అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. ఆ అమ్మాయి మీద చేయి వేసినందుకు దేవుడు సిద్ధారెడ్డిని చంపేసి తానే ఆ ముఠాకు నాయకుడవుతాడు. వెంకటేశ్వర్లు (రంగనాథ్) ఒక నిజాయితీ గల ఫైర్ ఆఫీసరు. తన భార్య శాంతి (తాళ్ళూరి రామేశ్వరి), కొడుకు సీతారాం (మహేష్ బాబు) తో కలిసి ఆనందంగా జీవితం గడుపుతుంటాడు. ఒకసారి దేవుడు మార్కెట్ ను తగలబెట్టిస్తాడు. అప్పుడు వెంకటేశ్వర్లు తన సిబ్బందితో సహా వచ్చి మంటలు ఆర్పిస్తాడు. కానీ అది ఇష్టం లేని దేవుడు మంటలపై కిరోసిన్ పోసి మరింత తగులబెట్టాలనుకుంటాడు. దాంతో వెంకటేశ్వర్లు అతన్ని కొడతాడు.

వెంకటేశ్వర్లు మీద కక్షతో అతన్ని ఓ తప్పుడు కేసులో అరెస్టు చేయిస్తాడు దేవుడు. సీతారాం తన తండ్రిని ఎలాగైనా బయటకు తీసుకురావాలని చాలా మంది అధికారుల చుట్టూ తిరుగుతాడు. కానీ వాళ్ళందరూ లంచం లేనిదే పనిజరగదని చెబుతారు. దేవుడి సూచనల మేరకు ఓ సి. ఐ వెంకటేశ్వర్లును చంపించేస్తాడు. అతని భార్య శాంతి తన భర్త మరణానికి కారణమైన వారి మీద ఎలాగైనా పగ సాధించాలనుకుంటుంది. అప్పటి దాకా అమాయకుడుగా ఉన్న తన కొడుకు సీతారాంను అనేక రకాలుగా శిక్షణనిచ్చి ఒక పద్ధతి ప్రకారం వెంకటేశ్వర్లు మృతికి కారణమైన వారిని ఒక్కొక్కరిని మట్టుబెడుతూ వస్తారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఎటువంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడతారు.

ఈ హింసలు కంటే ఆ జయం నిజం లే బాగున్నాయి

ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో తేజ దర్శకత్వంలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత ఒక హిట్ కూడా లేదు. వాస్తవంగా చెప్పాలంటే రీసెంట్ గా వచ్చిన అహింస సినిమా బానే వర్కౌట్ అవుతుందని అందరు ఊహించారు. కానీ ఆ సినిమాతో ఆడియన్స్ కి హింసే మిగిలింది. ఈ హింసల కంటే కూడా ఆ నిజం, జయం లే బాగున్నాయి అనేది కొంతమంది అభిప్రాయం. మళ్ళీ ఆ తేజ బయటకు వచ్చి సినిమా చేస్తే చూడాలని చాలామంది వెయిటింగ్.ఇకపోతే నిజం సినిమా వచ్చి నేటికి 21 ఏళ్లు అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు