Satyabhama: కాజల్ కి ఏమైంది , ఎందుకు ఇలా అందరిని టార్గెట్ చేస్తుంది

Satyabhama: ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ ఒకరు. లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చారు కాజల్ అగర్వాల్. అయితే ఈ సినిమాతోనే మంచి గుర్తింపును సాధించుకుంది కాజల్. ఆ తరువాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన మగధీర అనే సినిమా కాజల్ కి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ సినిమాలు హిందూ పాత్రలో కనిపించింది కాజల్. అక్కడితో చాలామంది తెలుగు ప్రేక్షకులకి దగ్గరయిపోయింది.

కాజల్ కి వరుస అవకాశాలు

మగధీర తర్వాత కాజల్ కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య 2 సినిమాలో గీతా పాత్రలో కనిపించింది కాజల్. ఇంతకుముందు వచ్చిన ఆర్య సినిమాలో గీతా అనే పాత్రకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే ఆర్య 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఘన విజయాన్ని సాధించింది. ఇకపోతే ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేయడం మొదలుపెట్టింది. ప్రతి స్టార్ హీరో తో కూడా కాజల్ కి ఒక మంచి హిట్ చిత్రం ఉంది అని చెప్పొచ్చు.

Kajal Agarwal

దాదాపు అందరి స్టార్స్ తో

కేవలం ఇప్పుడున్న స్టార్ హీరోలుతో మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోతో కూడా జతకట్టి సూపర్ హిట్ సినిమాను అందుకుంది. ఎన్టీఆర్ తో బృందావనం, ప్రభాస్ తో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలతో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద గట్టిగానే నిలిచాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, సూపర్ సార్ మహేష్ బాబు సరసన బ్రహ్మోత్సవం వంటి సినిమాల్లో కనిపించింది. మహేష్ బాబుతో చేసిన బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

- Advertisement -

ఎందుకు ఇలా అందరిని టార్గెట్ చేస్తుంది

ప్రస్తుతం కాజల్ ఇప్పుడు సత్యభామ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూస్ ఇస్తుంది కాజల్. అయితే ప్రతి ఇంటర్వ్యూలో కూడా ప్రతి ఒక్కరిని కెలికి పడేస్తుంది అని చెప్పాలి. అయితే ఇదంతా కాజల్ కావాలని చేస్తుందా లేకపోతే నిజంగానే కాజల్ ఒపీనియన్స్ చెబుతుందని ఎవరికి అర్థం కావట్లేదు. రీసెంట్ గా కాజల్ కి బాగా నచ్చిన సినిమా ఏంటి అని అడిగితే బ్రహ్మోత్సవం అని చెబుతుంది. బ్రహ్మోత్సవం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు అభిమానులు కూడా ఆ సినిమాను తలుచుకోరు. ఆ సినిమాను తనకు ఇష్టం అని చెబుతుంటే, అది వెటకారం కొంతమంది ఫీల్ అయ్యారు. ఇకపోతే ఆచార్య సినిమాలో మొదటి హీరోయిన్ గా కాజల్ ను అనుకున్నారు. అయితే ఈ సినిమా గురించి కూడా రీసెంట్ గా అడిగితే సత్యభామ ఈవెంట్లో పెద్ద గొడవ చేశారట కాజల్. ఇలా చాలామంది పైన కామెంట్స్ చేస్తూ వస్తుంది కాజల్. ఎందుకు ఇలా అందరిని టార్గెట్ చేస్తుంది.? సినిమా ప్రొమోషన్ కోసమా, ఇంకేమైనా ఉందా అని కొందరికి సందేహం మొదలైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు