Aishwary thackeray : సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న గొప్ప నాయకుడి మనవడు!

Aishwary thackeray : మామూలుగా సినిమాల్లోకి సినీ వారసత్వంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కామనే. అలాగే ఇతర ఇండస్ట్రీలకి చెందిన వ్యాపారవేత్తల పిల్లలు కూడా ఎంట్రీ ఇస్తుంటారు. కానీ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారి వారసులు రాజకీయాల్లో కాకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అరుదైన విషయం. ఇక టాలీవుడ్ లో నారా ఫ్యామిలీ నుండి నారా రోహిత్ ఎంట్రీ ఇవ్వగా, రీసెంట్ గా ప్రముఖ పొలిటీషియన్ జయదేవ్ గల్లా కొడుకు అశోక్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయినా ఇతడు మహేష్ బాబు మేనల్లుడు కూడా అని తెలిసిందే. అలాగే బాలీవుడ్ లో రితేష్ దేశ్ ముఖ్, ఆయుష్ శర్మ, ప్రతీక్ బబ్బర్ లాంటి హీరోలు పొలిటికల్ ఫ్యామిలీ నుండి వచ్చిన వారే. తాజాగా బాలీవుడ్ లో ఓ రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న కుటుంబం నుంచి వారసుడు సినీరంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రంగుల ప్ర‌పంచంలో సినీ హీరోగా ఏలాల‌ని క‌ల‌లు కంటున్నాడు. ఇంత‌కీ ఎవ‌రా కాబోయే హీరో? అని అంటే… ముంబైలో ఎవ‌రి పేరు చెబితే గ‌డ‌గ‌డ‌లాడ‌తారో, అలాంటి ఒక గొప్ప నాయ‌కుడి మనవడు ఇప్పుడు సినీరంగంలోకి రాబోతున్నాడు. రాజ‌కీయాల్లో ద‌శాబ్ధాల చ‌రిత్ర ఉన్న థాక్రే కుటుంబం అది. శివసేన వ్యవస్థాపకులు బాల్ థాక్రే మరో మనవడు ఐశ్వరీ ఠాక్రే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు బాలీవుడ్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.

Aishwary Thackeray is the grandson of Bal Thackeray making his film debut

థాక్రే బ్యాక్ గ్రౌండ్..

బాల్ థాక్రే మరో మనవడు ఐశ్వరీ ఠాక్రే సినిమా కెరీర్ ఎంపిక‌ గురించి ఇప్పుడు స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ముందు నుండి రొటీన్‌కి భిన్నంగా ఆలోచిస్తూ ఐశ్వరీ థాక్రే ఆ కుటుంబంలోనే ప్రత్యేకంగా నిలిచాడు. ఐశ్వరీ థాక్రే షోబిజ్‌లో కొన‌సాగాలని భావిస్తున్నాడు. ఐశ్వరి వినోద రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఐదేళ్లకు పైగా కష్టపడ్డాడట. అతడు 2015లో సంజయ్ లీలా భ‌న్సాలీ ‘బాజీరావ్ మస్తానీ`కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అప్పటి నుండి తన నటనా నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. పరిశ్రమలోని వ్యక్తులు అతని ప్రతిభను ప్రశంసించారు. అత‌డి కుటుంబ నేప‌థ్యం విభిన్నంగా ఉన్నా కానీ.. ఐశ్వరీ తన ఇంటిపేరుతో వచ్చే స్పాట్‌ లైట్ నుండి దూరంగా మ‌సులుతున్నాడు. ముఖ్యంగా తండ్రి, తాత పేర్ల‌ను అత‌డు ఉప‌యోగించుకోద‌లుచుకోలేదు.

- Advertisement -

త్వరలో గ్రాండ్ ఎంట్రీ?

ఇక ఐశ్వ‌రీ (Aishwary thackeray) గురించి పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. అత‌డు స్మితా ఠాక్రే – దివంగత జయదేవ్ ఠాక్రేల కుమారుడు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే మనవడు. ఇక ఇండస్ట్రీలో అత‌డిని దగ్గరగా చూసిన వారు చిత్ర పరిశ్రమలో రాణిస్తాడని అంగీక‌రించారు. అందుకే ఇప్పుడు ఐశ్వ‌రీ థాక్రేపై అంద‌రి దృష్టి ఉంది. ఐశ్వరీ ఫిల్మ్ మేకింగ్‌లోని ప్రతి విభాగంలోనూ చాలా విష‌యాల‌ను నేర్చుకున్నాడు. ఐశ్వరి సినిమాల్లో స్థిరపడేందుకు 5 సంవత్సరాలు పాటు సెట్స్ లోనే ఉన్నాడు. సినిమాల గురించి అన్ని పనులను నేర్చుకుంటూ భన్సాలీ దగ్గర అసిస్టెంట్‌గా కొన‌సాగాడు. అతడికి కళ – సంగీతంపై అపారమైన ఆసక్తి ఉంది. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే ఐశ్వరీ గురించిన కొన్ని పెద్ద ప్రకటనలను చూడ‌బోతున్నామ‌నేది తాజా సమాచారం.

బాల్ థాక్రేపై సినిమాలు..

ఇక బాల్ థాక్రే ఇండియాలోనే అత్యంత గొప్ప నాయకుల్లో పేరు పొందారు. ఇక 2005లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సూప‌ర్ హిట్ మూవీ ‘సర్కార్’ లో అమితాబ్ బచ్చన్ పాత్ర, బాల్ థాక్రే పాత్ర నుండి ప్రేరణ పొంది క‌థ‌ను రాసుకున్నాడు. అలాగే `బాల్కడు` అనే 2015 మరాఠీ చిత్రం బాల్ థాక్రే సిద్ధాంతాలపై ఆధారపడి తెర‌కెక్కింది. ఈ చిత్రం కోసం థాక్రే రాజకీయ జీవితానికి సంబంధించిన వాయిస్ క్లిప్పింగ్‌ లను కూడా ఉప‌యోగించారు. ఇక నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన బాలీవుడ్ బయోపిక్- థాక్రే. ఇది 25 జనవరి 2019న విడుదలైంది. ఇక ఐశ్వరి థాక్రే సినిమా ఎంట్రీ వార్త కోసం బాలీవుడ్ మీడియా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. మరి అతడి సినిమా ఎంట్రీ పై కన్ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు