Gowthami: నా జీవితంలో అది ఒక గుణపాఠం.. గౌతమి హాట్ కామెంట్స్..!

Gowthami: గతంలో పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది సీనియర్ హీరోయిన్ గౌతమి. మొదటిసారిగా ఫ్యాషన్ డిజైనర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి.. ఆ తర్వాత చిత్ర పరిశ్రమ లోకి అడుగు పెట్టింది గౌతమి.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పలు సినిమాల్లో నటిస్తున్నట్లు సమాచారం. తెలుగు , తమిళ్ పరిశ్రమలో కూడా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఈమె సినీ జీవితం ఎంత బాగా ఉన్నప్పటికీ ఆమె పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటుంది. తాజాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమి రిలేషన్షిప్ పైన పలు రకాల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

గౌతమి మొదటి వివాహం..

హీరోయిన్ గౌతమి తన జీవితంలో స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న ఈమె తన పర్సనల్ జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.. మొదట్లో గౌతమి బిజినెస్ మాన్ అయిన సందీప్ భాటియాను పెళ్లి చేసుకుంది. వీరికి సుబ్బలక్ష్మి అనే కూతురు కూడా జన్మించిందట. అలా పాప పుట్టిన ఏడాదికే గౌతమి తన భర్త సందీప్ కు విడాకులు ఇచ్చింది.. ఆ తర్వాత కమలహాసన్ తో ప్రేమలో పడి కొన్నేళ్లపాటు సహజీవనం కూడా చేశారు.. అలా కొంతకాలానికి వీరిద్దరూ విడిపోయారనే వార్తలు వినిపించాయి.

రిలేషన్షిప్ పై గౌతమి కామెంట్..

Gowthami: That was a lesson in my life.. Gowthami hot comments..!
Gowthami: That was a lesson in my life.. Gowthami hot comments..!

ఇలా తన కెరియర్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది తాజాగా గౌతమి మాట్లాడుతూ.. ఎవరి జీవితంలో వారు బలంగా ఉంటేనే బాదేసినప్పుడు ధైర్యంగా ఉంటారనీ తెలియజేసింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు తమలో ధైర్యాన్ని నింపే వ్యక్తుల మాటలనే వినాలని తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా రిలేషన్షిప్ వర్కౌట్ కాలేదంటే అందుకు పూర్తి బాధ్యత నీదే అని కూడా తెలియజేసింది.ముఖ్యంగా రిలేషన్ లో ఇద్దరు వ్యక్తులు మధ్య బాండింగ్ కేంద్ర బిందువుగా ఉంటుంది. అక్కడ సమానంగా ఉంటేనే ఆ జీవితం ముందుకు వెళుతుంది.. లేకపోతే మధ్యలోనే తెగిపోతుంది అంటూ తెలిపింది.

- Advertisement -

కమలహాసన్ ను ఉద్దేశించేనా..

చాలామంది కొన్ని విషయాలలో ఒప్పుకోవడానికి మొహమాటపడుతూ ఉంటారు.. ఇలాంటివి చేయడం తప్పు.. తన జీవితంలో కూడా రిలేషన్ అంటే ఒక గుణపాఠంగా మారిపోయిందని తెలిపింది గౌతమి.. లవ్ కమిట్మెంట్ అనేది రెండు వైపులా ఒకేలా ఉండాలని తెలిపింది. అప్పుడే ఆ బంధం ఎక్కువ కాలం నిలుస్తుంది అంటూ తెలియజేసింది గౌతమి.. అయితే ఈమె చేసిన వ్యాఖ్యలు హీరో కమలహాసన్ ను ఉద్దేశించే చేసినట్లుగా కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి రిలేషన్షిప్ పైన ఈమె ఎలా వాఖ్యలు చేసి ఉంటుందని అభిప్రాయం కూడా వినిపిస్తోంది. మొత్తానికైతే గౌతమి చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి..

క్యాన్సర్ నుంచి జయించింది..

ఇకపోతే కమలహాసన్ తో రిలేషన్ లో ఉన్నప్పుడే ఈమె క్యాన్సర్ బారిన పడింది.. ఇక క్యాన్సర్ నుంచి కోలుకొని ఇప్పుడు మళ్ళీ అడపా దడపా సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది గౌతమి ఏది ఏమైనా గౌతమి రిలేషన్ షిప్ పై చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు