Love Me Movie First Review: లవ్ మీ మూవీ ఫస్ట్ రివ్యూ, టీం సైలెన్స్ కు ఇదే కారణమా.?

Love Me Movie First Review: దిల్ అనే సినిమాతో ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టి తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నో అద్భుత మైన సినిమాలను అందించారు దిల్ రాజు. దిల్ రాజు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి ప్రతి సినిమా దేనికి అదే ప్రత్యేకం అని చెప్పొచ్చు. అయితే ఈ బ్యానర్ లో ఫెయిల్యూర్ సినిమాలు కూడా వచ్చాయి. ఎక్కువ శాతం మాత్రం దిల్ రాజు జడ్జిమెంట్ పర్ఫెక్ట్ అయింది కొన్నిసార్లు మాత్రమే మిస్ ఫైర్ అయింది. చాలామంది దర్శకులను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత దిల్ రాజుకి ఉంది.

దిల్ రాజు నిర్మించిన మరో బ్యానర్

ఇకపోతే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కి అనుసంధానంగా దిల్ రాజు ప్రొడక్షన్స్ అని ఒక కొత్త బ్యానర్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ లో వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ బలగం అనే సినిమా ను తీశారు. ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ కి ఈ సినిమా మంచి కీర్తిని తీసుకొచ్చింది. ఇటువంటి సినిమాలే ఈ బ్యానర్ లో ఇంకా రావాలి అంటూ దిల్ రాజు కూడా చెప్పుకొచ్చారు. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యానర్ లో వస్తున్న సినిమా లవ్ మీ. ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు.

Love Me Movie First Review
Love Me Movie First Review

మరో ఆర్య అవుతుందా

లవ్ మీ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా మాట్లాడుతూ ఒక సందర్భంలో ఆర్యతో కూడా పోల్చారు. ఆర్య సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లవ్ స్టోరీలు సినిమా ప్రస్తావన వస్తే అందులో ఆర్య సినిమాకి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అటువంటి ఆర్య సినిమాతో ఈ సినిమాని పోల్చడంతో అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ మొదలైంది. ఈ సినిమా ఎప్పుడు వస్తుందని అందరూ వెయిట్ చేయటం మొదలుపెట్టారు.

- Advertisement -

లవ్ మీ సినిమా పరిస్థితి ఏంటి.?

లవ్ మీ సినిమా మే 25న రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఈ తరుణంలో ఈ సినిమా గురించి ఒక ఇన్సైడ్ టాక్ బయటకు వచ్చింది. అయితే సినిమా ఊహించినంతగా ఏమీ లేదని. ఇది ఒక యావరేజ్ ఫిలిం అంటూ టాక్ వినిపిస్తుంది. కొంతమంది అయితే ఈ సినిమా గోవిందా అంటూ కూడా చెబుతున్నారు. మామూలుగా దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటేనే ప్రమోషన్స్ పీక్ లో ఉంటాయి. కానీ ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చినా కూడా ప్రమోషన్స్ జోరుగా సాగట్లేదు. సినిమా రిజల్ట్ ముందుగానే ఊహించి సైలెంట్ అయ్యారు అని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా దిల్ రాజు జడ్జిమెంట్ కొన్నిసార్లు మాత్రమే ఫెయిల్ అయింది. ఇకపోతే ఈ సినిమా కథను కూడా హీరోయిన్ వైష్ణవి చైతన్య ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రివీల్ చేసింది. ఈ సినిమా అసలైన రిజల్టు ఏంటి అనేది 25న తెలియనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు