Thani Oruvan2 : సరైన విలన్ ను సెట్ చేసాడు

Thani Oruvan2 : అరవింద్ స్వామి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మణిరత్నం దర్శకత్వం వహించిన రోజా సినిమా తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఆ సినిమాలో కనిపించిన అరవింద్ స్వామికి చాలామంది అభిమానులు ఉన్నారు. ఆ తర్వాత అరవింద్ స్వామి చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యాయి. ఒకప్పుడు అబ్బాయిల అందాన్ని కూడా పోలుస్తూ నువ్వేమైనా అరవింద్ స్వామి అనుకుంటున్నావా అంటూ ఉండేవాళ్ళు.

Thani Oruvan

తని ఒరువన్ సినిమాతో విలన్ గా

జయం రవి, నయనతార జంటగా నటించిన తమిళ సినిమా ‘తనీ ఒరువన్’. అరవింద్ స్వామి విలన్ గా నటించిన’ ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. 2015లో వచ్చిన ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇదే సినిమా రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ధ్రువ’గా తెలుగులో రీమేక్ చేసారు. ఇక్కడ కూడా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించుకుంది. సురేందర్ రెడ్డి ఈ సినిమాను అద్భుతంగా డీల్ చేశాడు. ఈ సినిమాలో కూడా అరవింద్ విలన్ గా కనిపించారు. అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. విలన్ అంత పవర్ ఫుల్ గా ఉండడం బట్టి హీరో కూడా అంత బాగా ఎలివేట్ అయ్యాడని చెప్పొచ్చు. అందుకని ఒక హీరోని కాస్త విలన్ గా మార్చాడు మోహన్ రాజా.

- Advertisement -

Thani Oruvan 2

మరో హీరోని విలన్ గా మారుస్తున్నాడు

బాలీవుడ్ అమితాబచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ తని వరువన్ 2 లో విలన్ గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ బాగా హిట్ అవడంతో సెకండ్ పార్ట్ పైన అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ఇప్పటివరకు అభిషేక్ బచ్చన్ ను చాలా సినిమాల్లో హీరోగా చూశాం. అభిషేక్ కెరియర్ లో కూడా మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాలో విలన్ గా అభిషేక్ నటిస్తున్నాడు అని వార్తలు రావడంతో చాలామందికి క్యూరియాసిటీ మొదలైంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జయం రవి సరసన నయనతార కనిపించనుంది. నయనతార జయం రవి ఇద్దరు కలిసి ఇదివరకే నాలుగు సినిమాలు చేశారు. అలానే దర్శకుడు మోహన్ రాజా జయం రవితో చేస్తున్న ఏడవ సినిమా ఇది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు