Megastar Chiranjeevi: విశ్వంభర షూటింగ్ అప్డేట్, ఎప్పటికీ పూర్తి అవుతుంది అంటే

Megastar Chiranjeevi: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న ఆసక్తికరమైన ప్రాజెక్టులలో విశ్వంభర సినిమా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే బిబిసారా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు వశిష్ట. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ను సాధించింది. దాదాపు కళ్యాణ్ రామ్ పరిస్థితి అయిపోయింది అనుకునే టైంలో ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ కు పెద్ద ప్లస్ అయింది. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ వరుస సినిమాలు చేసుకుంటూ కెరియర్లో ముందుకు వెళుతున్నాడు.

Vishwambhara update
చాలా ఏళ్ల తర్వాత సోషియో ఫాంటసీ జోనర్

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ జానర్ లో రానుంది. ఈ సినిమాను జగదేకవీరుడు అతిలోకసుందరి అనే సూపర్ హిట్ సినిమాతో కూడా కంపేర్ చేయడం మొదలుపెట్టారు. ఇకపోతే దర్శకుడు వశిష్ట తన మొదటి సినిమా బింబిసార కూడా దాదాపు అటువంటి జోనర్ లో చేసాడు. ఇకపోతే రెండవ సినిమాకి మెగాస్టార్ చిరంజీవితో అవకాశం రావడం అనేది మామూలు విషయం కాదు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలా మంది కలలు కంటున్నారు. ఎంతోమంది దర్శకులకి మెగాస్టార్ తో ఆల్మోస్ట్ కథ ఓకే అయిపోయింది అనుకునే తరుణంలో కూడా ఆ సినిమా రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి.

విశ్వంబర షూటింగ్ అప్డేట్

ఇది సినిమాకు సంబంధించిన షూటింగ్ మరో షెడ్యూల్ నిన్న హైదరాబాద్లో మొదలైంది. ఈ షెడ్యూల్లో మేజర్ పార్ట్స్ అన్ని కూడా షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే జులై మంత్ కి ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసే ప్లానింగ్ లో ఉందంట చిత్ర యూనిట్. జులై మంత్ లో కంప్లీట్ చేస్తే ఇది సోషియో ఫాంటసీ సినిమా కాబట్టి సీజీ వర్క్ కి వి ఎఫ్ ఎక్స్ వర్క్ కి పర్ఫెక్ట్ గా చేయడానికి టైం దొరుకుతుందని చెప్పొచ్చు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు.

- Advertisement -

రిలీజ్ ఫిక్స్ అయినట్లే

ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జూలైలో పూర్తయిపోతే ఈ సినిమా సంక్రాంతికి రావడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ సినిమాను జనవరి 10న రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. అయితే మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ కి ఒక పర్ఫెక్ట్ సినిమా పడితే అది కూడా పండగ సీజన్ అయితే కలెక్షన్లు వేరే రేంజ్ లో వస్తాయి. ఇప్పుడు దాదాపు ఈ సినిమాకి అదే రిపీట్ అయినట్లు కనిపిస్తుంది. ఈ సినిమా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయితే మెగాస్టార్ చిరంజీవి స్థాయి ఏంటో మరోసారి బాక్సాఫీస్ వద్ద ప్రూవ్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు