Keerthi Suresh: బోల్డ్ సీన్స్ కూడా ఓకే చెప్పేసిందట

Keerthi Suresh: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో కీర్తి సురేష్ ఒకరు. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన నేను శైలజ అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి అనే సినిమాలో కూడా నటించింది. అయితే ఈ సినిమా ఊహించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. కానీ కీర్తికి మాత్రం అవకాశాలు బాగానే వచ్చాయి.

Mahanati

మహానటి సినిమాతో బ్రేక్

తెలుగు సినిమాలో బయోపిక్ సినిమాల గురించి ప్రస్తావన వస్తే మొదట మాట్లాడవలసిన సినిమా మహానటి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. బయోపిక్ ను అందరినీ ఆకట్టుకునేలా తీసి ప్రేక్షకుల హృదయాల్లో ఒక స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో మొదట కీర్తి సురేష్ నటిస్తుంది అని అనౌన్స్మెంట్ చేసినప్పుడు చాలామంది విమర్శలు చేశారు. వీటన్నిటికీ సమాధానంగా కీర్తి తన పర్ఫామెన్స్ తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికీ కీర్తి కెరియర్లో బెస్ట్ ఫిలిం అంటే మహానటి అని చెప్పొచ్చు.

- Advertisement -

Dasara Movie Keerthy Suresh

దసరా సినిమాతో మరికొంత గుర్తింపు

శ్రీకాంత్ ఓదెల దర్శకుడుగా పరిచయమైన సినిమా దసరా. నాని హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో వెన్నెల అనే పాత్రలో నటించింది కీర్తి. అయితే ఈ పాత్ర కోసం ముందు చాలామందిని అనుకున్నాడు దర్శకుడు శ్రీకాంత్. అయితే కీర్తి బాగుంటుందని నాని చెప్పినప్పుడు కీర్తి కి కథ చెప్పడం మొదలుపెట్టాడు. కీర్తి కి మొదట అర్థం కాక తనకి నచ్చలేదు అని చెప్పింది. అలా చెప్పడంతో దర్శకుడు కూడా కొంచెం హ్యాపీ అయ్యాడు. మళ్లీ నాని ఒకసారి వినమని రిక్వెస్ట్ చేయడంతో ట్రాన్స్లేటర్ సహాయం తో కథను విన్నారు కీర్తి. ఆ తర్వాత శ్రీకాంత్ కూడా కీర్తితో పనిచేయటం మొదలుపెట్టాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది.

బోల్డ్ సీన్స్ కు ఓకే చెప్పింది

రీసెంట్ గా జవాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు అట్లీ. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ప్రస్తుతం అట్లీ తెరకెక్కించిన “తేరి” సినిమాని బాలీవుడ్ లో “బేబీ జాన్” అనే పేరుతో నిర్మాతగా మారి వరుణ్ ధావన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఎలాంటి బోల్డ్ సీన్స్ లో నటించలేదు. మొదటిసారిగా బాలీవుడ్ సినిమా కోసం ఆమె బోల్డ్ సీన్స్ కి కూడా ఓకే చెప్పినట్టుగా పలు వార్తలు వైరల్ మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు