Rakul: వారిపై ఆగ్రహంతో రెచ్చిపోయిన రకుల్ తండ్రి.. కారణం..?

Rakul.. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీతి సింగ్.. ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ కి దూరమై బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది.. అలాగే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. దీంతో బాలీవుడ్ కే పరిమితం అయిపోయింది. రకుల్ ప్రీతిసింగ్ మీద ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఒక రూమర్ వైరల్ గా మారడంతో ఈమె తండ్రి తాజాగా ఫైర్ అయినట్టు తెలుస్తోంది. వాటి గురించి చూద్దాం.

రకుల్ పై రూమర్లు..

Rakul: Rakul's father got angry with them.. the reason..?
Rakul: Rakul’s father got angry with them.. the reason..?

తాజాగా రకుల్ ప్రీతిసింగ్ కూడా కొన్ని రూమర్లను ఎదుర్కొంటోంది. ఆ రూమర్స్ తో తన కుటుంబం కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే రకుల్ ప్రీతిసింగ్ ఫామ్ లో ఉన్నప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన జోడీ గా నటించి మెప్పించింది. కానీ ఏమైందో తెలియదు కానీ అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. గతంలో కూడా డ్రగ్స్ కి సంబంధించిన విషయంలో రకుల్ పేరు కూడా చాలా గట్టిగానే వినిపించింది. ఆ తర్వాత అందుకు సంబంధించిన ప్రూఫ్ లు లేకపోవడంతో చాలామంది సెలబ్రిటీలను కూడా వదిలేశారు.

రకుల్ పై వస్తున్న రూమర్స్ కి స్పందించిన ఆమె తండ్రి..

ఇదిలా ఉండగా మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాదులో ఒక లగ్జరీ హౌస్ కొన్నదని.. అయితే అది తన కష్టంతో కొనుక్కుంటే తనకు ఎవరో గిఫ్ట్ ఇచ్చారనే రూమర్స్ సైతం పుట్టించారని తెలియజేసింది.. అయితే ఆ సమయంలో తన తండ్రి ఢిల్లీలో ఉండడం జరిగిందట.. తన సంపాదన గురించి అలాగే తాను పడే కష్టం గురించి తన తండ్రికి పూర్తిగా తెలుసని.. తనకి లగ్జరీ హౌస్ కొనిచ్చారంటూ వస్తున్న వార్తలను తన తండ్రి చూసి చాలా కోప్పడ్డాడని తెలిపింది. ముఖ్యంగా తన మేనేజర్ కు తన తండ్రి ఫోన్ చేసి చాలా ఫైర్ అయ్యాడట. తన కూతురు చాలా కష్టపడి ఆ ఇంటిని నిర్మించుకుంటే ఇంకెవడో ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు ఇలాంటి రూమర్స్ ఎలా వస్తున్నాయి అంటూ తన మేనేజర్ ని తిట్టారట రకుల్ ప్రీతిసింగ్ తండ్రి.

- Advertisement -

ఫైర్ అవుతున్న రకుల్ ఫాదర్..

దీంతో వెంటనే తన తండ్రికి రకుల్ ప్రీతిసింగ్ ఫోన్ చేసి ఇలాంటి రూమర్స్ అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ సర్ది చెప్పానని తెలిపింది. ఇక అప్పటినుంచి తన గురించి ఏదో ఒక రూమర్స్ రావడం కామన్ గా మారిపోయిందని ఈ విషయాలను తన కుటుంబం కూడా లైట్ గా తీసుకుంటుంది అంటూ రకుల్ ప్రీతిసింగ్ తెలియజేసింది.. ఇలాంటి విషయాలలో ఎవరి ఫ్యామిలీకైనా సరే ఖచ్చితంగా కోపం వస్తుందని అలాగే తన తండ్రి కూడా రియాక్ట్ అయ్యారని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. మోత్తానికైతే రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి కోప్పడడంలో ఎటువంటి తప్పులేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు