Priyanka Chopra : బుల్గరీ ఉత్సవాల్లో డైమండ్ లా ప్రియాంక.. మెడలో నెక్లెస్ వ్యాల్యూ తెలిస్తే కళ్ళు జిగేలుమంటాయి..

Priyanka Chopra : బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన ఈ భామ పెళ్లి తర్వాత సినిమాలకు దాదాపు దూరమయ్యింది. కానీ అడపా దడపా హాలీవుడ్ లో సందడి చేస్తూనే ఉంది. ముఖ్యంగా హాలీవుడ్ లో జరిగే ఆస్కార్ అవార్డ్స్ నుండి, మిగతా అన్ని రకాల ఫిల్మ్ ఫెస్టివల్స్ తో సహా ఎన్నో షోలలో సందడి చేస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది. ఇక తాజాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రియాంక తెగ సందడి చేసింది. ఇక ప్రియాంక ఫోటోషూట్ల గురించి కూడా స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. డిజైన‌ర్ డ్రెస్సుల్లో త‌న‌దైన మార్క్ అప్పిరియ‌న్స్ తో ఆకట్టుకుంటుంది. ఇక ఫోటో షూట్లు.. క‌వ‌ర్ పేజీల కోసం ఈ అమ్మ‌డి డ్రెస్సింగ్ సెలెక్షన్స్ సంథింగ్ స్పెష‌ల్ గా హైలైట్ అవుతుంటాయి. ఇక ప్ర‌త్యేక ఈవెంట్ల కోసం ఇంకెంత అందంగా ముస్తాబవుతుందో చెప్పాల్పిన ప‌నిలేదు. అందులోనూ కేన్స్ లాంటి ఉత్సావాల్లో పాల్గొంటే ప్రియాకం బ్రాండ్ ని మామూలుగా వేయ‌దు.

కేన్స్ లో మురిసిపోయిన ప్రియాంక..

తాజాగా జ‌రుగుతోన్న బుల్గరీ ఉత్స‌వాల కోసం ముస్తాబైన ఓ పిక్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. అందులో అమ్మ‌డు స్కిన్ టైట్ షోల్డ‌ర్ లెస్ డిజైన‌ర్ గౌనులో త‌ళుక్కున మెరిసింది. డార్క్ బ్లూ అండ్ వైట్ కాంబినేష‌న్ లో పీసీ బ్యూటీని ఆ డిజైన‌ర్ మ‌రింత రెట్టింపు చేసింది. ప్ర‌త్యేకంగా నెక్ ని హైలైట్ చేస్తూ ఇన్ స్టాలో ఓ రీల్ వైర‌ల్ అవుతుంది. అంద‌మైన మృదువైన నెక్ పై ప్రియాంక అందాన్ని రెట్టింపు చేస్తూ ధ‌రించిన నెక్ల‌స్ ఎంతో అందంగా ఉంది. ఆ బ్యూటీని మించి నెక్లెస్ మ‌రింత అందంగా ఫోక‌స్ అవుతుంది. పీసీ స్కిన్ టోన్ పై నెక్లెస్ మిరుమిట్లు గొలు పుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ప్రియాంక నెక్ బ్యూటీపై కామెంట్లు అంతే కూడా ఆస‌క్తిక‌రం. కేన్స్ ఉత్సావాలు ముగిసేలోపు ప్రియాంక నుంచి ఇలాంటి ట్రీట్ ఇంకా కంటున్యూ అవుతూనే ఉంటుంది. ఇప్ప‌టికే భార‌తీయ న‌టీమ‌ణుల రెడ్ కార్పెట్ వాక్ తో కేన్స్ వెడెక్కింది. వీదేశీ భామ‌ల్ని సైతం ఇండియ‌న్ మోడ‌ల్స్ ప‌క్క‌కు నెట్టేస్తున్నారని ప్రియాంక ని చూస్తే అనిపిస్తుంది.

The value of Priyanka Chopra's necklace is 358 crores

- Advertisement -

ప్రియాంక నెక్లెస్ వ్యాల్యూ తెలుసా?

ఇక ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హాలీవుడ్ బుల్గరీ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేయగా, అక్కడ తన మేడలో ఉన్న నెక్లెస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇంతకీ ఆమె మెడలో ఉన్న వజ్రాల హారం విలువ ఎంత తెలుసా? అక్షరాయాలా 358 కోట్లట. 140 క్యారెట్ల వజ్రాలతో చేసిన ఆ నెక్లెస్ తయారు చేయడానికి 2800 గంటల సమయం పట్టిందట. ఇక ఆ నెక్లెస్ లో 698 బాగెట్ వజ్రాలను ఉపయోగించి తయారు చేశారట. ఇక ప్ర‌స్తుతం ప్రియాంక చోప్రా పలు హాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. కెరీర్ ని అక్క‌డే ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతుంది. అలాగ‌ని బాలీవుడ్ ని లైట్ తీసుకోలేదు. అవ‌కాశాలు వ‌స్తే ఇక్క‌డ న‌టించ‌డానికి సిద్దంగానే ఉన్నానని పలు ఇంటర్వ్యూ లలో చెప్పింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు