OTT Movie : మంజుమ్మెల్ బాయ్స్ కంటే ముందే ఓటిటీలోకి వచ్చిన సర్వైవల్ థ్రిల్లర్… గ్యాంగ్ అంతా 2 వారాలు గుహలోనే…

OTT Movie : మంజుమ్మెల్ బాయ్స్ అనే మలయాళం మూవీ రిలీజ్ అయ్యాక సర్వైవల్ థ్రిల్లర్  సినిమాలకు క్రేజ్ మరింతగా పెరిగింది. ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇలాంటి మరో సర్వైవల్ థ్రిల్లర్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసింది. రెండు ఒకే జానర్ సినిమాలు అయినప్పటికీ కథ మాత్రం వేరుగా ఉంటుంది. మంజుమ్మెల్  బాయ్స్ లో గుహలో పడిపోయిన ఒక స్నేహితుడిని కాపాడుకోవడానికి ప్రాణాలు అడ్డేసి మరీ పోరాడుతారు స్నేహితులు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో మాత్రం 13 మంది గ్యాంగ్ ఏకంగా రెండు వారాల పాటు ఒక గుహలో చిక్కుకుంటారు. మరి ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చిన మూవీ ఏంటి? ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయంలోకి వెళ్తే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ పేరు థాయ్ కేవ్ రెస్క్యూ. 2022 నుంచే ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. కానీ అప్పట్లో సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లు అంతగా ట్రెండింగ్ లో లేకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు జనాలు. కానీ మంజుమ్మెల్ బాయ్స్ ఎఫెక్ట్ వల్ల ఇలాంటి సిరీస్, సినిమాలకు క్రేజ్ పెరగడంతో ఓటీటీలో పెద్ద ఎత్తున సజెషన్ లిస్ట్ లోకి వచ్చేసాయి.

Bangkok Post - Streaming giant shines new light on Thai boys cave rescue

- Advertisement -

థాయ్ కేవ్ రెస్క్యూ స్టోరీ లోకి వెళ్తే…

2018లో ఉత్త థాయ్ లాండ్ లోని థామ్ లాంగ్ నాంగ్ నన్ అనే గుహలో 12 మంది విద్యార్థులతో కూడిన ఫుట్బాల్ టీం అసిస్టెంట్ కోచ్ తో సహా చిక్కుకు పోతారు. అందులో 11 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు ఉంటారు. ఇక కోచ్ వయసు కేవలం 25 ఏళ్ళే. ఆ గుహను సరదాగా చూడడానికి వెళ్లి, భారీ వర్షాల కారణంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల అక్కడే చిక్కుకు పోతారు. ఆకస్మిక వరదలు థాయ్ ల్యాండ్ ను ముంచెత్తడంతో లోపల చిక్కుకున్న గ్యాంగ్ బయటకు రాలేకపోతుంది. వీళ్ళందర్నీ కాపాడడానికి రెస్క్యూ టీంకి ఏకంగా రెండు వారాల సమయం పడుతుంది. మరి అంతలోపు జరిగిన ఇంట్రెస్టింగ్ సంఘటనలు ఏంటి? వాళ్లను ఆ గుహ నుంచి ఎలా బయటకు తీసుకొచ్చారు? అనే విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు.

వాస్తవ సంఘటనల ఆధారంగా…

థాయ్ కేవ్ రెస్క్యూ స్టోరీ 2018 జూన్ జూలైలో నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించారు. అయితే ముందుగా సిరీస్ ను డాక్యుమెంటరీగా తీయాలనుకున్నారు. కానీ ఆ రెస్యూ ఆపరేషన్ కు సంబంధించిన లైవ్ ఫుటేజ్ అంతా సోషల్ మీడియాలో అందుబాటులో ఉండడంతో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సిరీస్ ని నిర్మించాలని నిర్ణయించుకుంది. ఇక ఈ ఆపరేషన్ లో పిల్లలంతా సేఫ్ గానే బయటపడ్డారు. కానీ రెస్క్యూ ఆపరేషన్ టీం లోని ఇద్దరు మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఈ ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాంటి సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో 6 ఎపిసోడ్లతో అందుబాటులో ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు