16 Years for Bujjigadu: బుజ్జిగాడికి 16 ఏళ్ళు , ప్రభాస్ కి మళ్ళీ ఇలాంటి సినిమా పడాలి

16 Years for Bujjigadu: ప్రస్తుతం తెలుగు సినిమా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా తెలుగు సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు తెలుగు సినిమా వేరు ఒకప్పుడు తెలుగు సినిమా వేరు. ఇప్పుడు తెలుగు సినిమాకి మంచి పేరు వస్తుంది. ఒకప్పుడు తెలుగు సినిమా కూడా మంచి పేరు ఉంది. ఆ పేరుతో పాటు తెలుగు సినిమాల్లో బీభత్సమైన ఎంటర్టైన్మెంట్ ఉండేది. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయి గుర్తింపు రావడం వలన కొందరు స్టార్ హీరోలు చేస్తున్న సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది. బేసిగ్గా చాలామంది తెలుగు ప్రేక్షకులకి సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్.

క్యారెక్టర్రైజేషన్ పూరి బలం

ఇకపోతే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చాలామంది హీరోలు నటించారు. పూరి జగన్నా తన కథలతో చాలామందికి మంచి ఇమేజ్ను కూడా క్రియేట్ చేశారు. స్టార్ హీరోలకు సైతం హిట్ సినిమాలు అందించారు పూరి. పూరి జగన్నాథ్ లో ఉన్న ప్రత్యేకత తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. ఒక హీరో క్యారెక్టర్రైజేషన్ అద్భుతంగా డిజైన్ చేయగలడు. కేవలం ఆ క్యారెక్టర్రైజేషన్ తో సినిమాను కూడా నడిపించగల సామర్థ్యం ఉన్న దర్శకుడు. పూరి జగన్నాథ్ సినిమాలు చాలామంది ఆడియన్స్ ఇష్టపడటానికి మెయిన్ రీజన్ ఆ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు.

Prabhas's Bujjigadu Movie

- Advertisement -

ప్రభాస్ ను మునుపెన్నడు చూడని విధంగా

ఇకపోతే పూరి జగన్నాథ్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన సినిమా బుజ్జిగాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా ఊహించిన సక్సెస్ ని సాధించలేకపోయినా కూడా ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికీ ఒక విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ యూత్ కి క్రేజీగా అనిపించింది. రజనీకాంత్ కి వీరాభిమానిగా ఈ సినిమాలో ప్రభాస్ కనిపిస్తాడు. ప్రభాస్ అక్కడ ఈ సినిమాలో తమిళ్ మాట్లాడటం కూడా ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ కి పూరి జగన్నాథ్ రాసిన డైలాగ్స్ అద్భుతం అని చెప్పాలి.

ఒక క్యూట్ లవ్ స్టోరీ

పేరు వినడానికి బుజ్జిగాడు అయినా కూడా ఇదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు చిన్నప్పుడు ఒక సరదా గొడవ వలన విడిపోయిన ఇద్దరు ఫ్రెండ్స్ దాదాపు 12 ఏళ్లపాటు మాట్లాడకుండా ఉంటారు. తనకు బాగా ఇష్టమైన ఒక అమ్మాయి గురించి ఒక అబ్బాయి వెతుక్కునే ప్రయత్నమే ఈ బుజ్జిగాడు సినిమా. ఈ సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్రలో ఎమ్మెస్ నారాయణ నటించారు. తండ్రి కొడుకులు మధ్య సీన్స్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమాలో ప్రభాస్ కామెడీ టైమింగ్ నెవర్ బిఫోర్ అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ ప్రభాస్ కెరియర్లు ఇలాంటి సినిమా మరొకటి పడలేదు. వీరి కాంబినేషన్లో వచ్చిన ఏక్ నిరంజన్ సినిమా అంతంత మాత్రమే ఆడింది. ఏదేమైనా ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న తరుణంలో బుజ్జిగాడు సినిమాని రిలీజ్ చేస్తే కచ్చితంగా బ్రేక్ ఇస్తారు.నేటికీ ఈ సినిమా వచ్చి 16 ఏళ్ళు అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు