Sumanth Akkineni: చావును వాయిదా వేసి మరి తాతగారు మనం కోసం పనిచేసారు

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న నటులలో ప్రత్యేకంగా తమకంటూ ఒక ప్రత్యేకమైన సినిమా ఉండటం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది అలా అక్కినేని ఫ్యామిలీ మొత్తానికి ఉన్న స్పెషల్ ఫిలిం మనం. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరూ ప్రీమియర్స్ కి హాజరై ఈ సినిమా తమకి ఎంతలా నచ్చిందో మీడియాలో చెప్పుకొచ్చారు. అప్పట్లో ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రేక్షకులు ముందుకి సినిమా వచ్చినా తర్వాత కూడా ప్రేక్షకులంతా సినిమాను అదే రేంజ్ లో ఆదరించారు.

Manam

మనం సినిమా ప్రత్యేకత

ఈ సినిమాలోని అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యామిలీకి సంబంధించిన మూడు తరాలను రివర్స్ లో చూపించారు. విక్రమ్ కే కుమార్ ఈ సినిమాను డీల్ చేసిన విధానం అద్భుతమని చెప్పొచ్చు. ఈ సినిమాకి పెద్ద ప్లస్ అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం. ఎప్పటికీ గుర్తుండిపోయి పాటలను ఈ సినిమాకి అందించాడు. అక్కినేని ఫ్యామిలీ అంతటికి ఈ సినిమా ఒక చిత్రపటం అని చెప్పొచ్చు. ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు 10 ఏళ్ళు కావస్తున్న తరుణంలో ఈ సినిమాను మళ్ళీ ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు.

- Advertisement -

మనం సినిమాతో అనుభవాలు

ఇక ఈ సినిమా రీ రిలీజ్ అవుతున్న తరుణంలో ఈ సినిమాకు సంబంధించి తమ జ్ఞాపకాలను, తమకు ఈ సినిమాతో ఉన్న అనుభవాలను మీడియా ముందుకి వచ్చి పంచుకుంటున్నారు అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్. రీసెంట్గా నాగచైతన్య ఈ సినిమా గురించి మాట్లాడుతూ దీంట్లోని ప్రేమకు సంబంధించిన డైలాగును చెప్పారు. ఇకపోతే రీసెంట్గా అక్కినేని సుమంత్ కూడా ఒక వీడియోను రిలీజ్ చేశారు. తాతగారు తన చావుని వాయిదా చేసుకుని మరి ఈ సినిమాలో నటించారు. క్యాన్సర్ చివరి స్టేజ్ లో ఉన్నా కూడా ఆయన అనుకున్న పనిని పూర్తి చేయగలిగారు అంటూ ఎన్నో అమూల్యమైన జ్ఞాపకాలను సినిమా గురించి పంచుకున్నారు. సుమంత్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం మీరందరూ ఎలా ఎదురు చూస్తున్నారు నేను కూడా అలానే ఎదురు చూస్తున్నాను మనం థియేటర్లో కలుద్దాం అంటూ చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు