OTT Movie : కూతురితో కలిసి భర్త పీక పిసికి చంపేస్తుంది భార్య… కానీ ఆ స్ట్రేంజ్ టీచర్ కు దొరికిపోయి…

OTT Movie : వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం మూవీ ఎంతటి సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సస్పెన్స్ తో కూడిన క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామాలకు క్రేజ్ ఎప్పటికి తగ్గదని ఈ మూవీ నిరూపించింది. మోహన్ లాల్ హీరోగా నటించిన దృశ్యం మూవీ ముందుగా మలయాళం లో రిలీజ్ అయింది. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఆ మూవీ ఆ తర్వాత చాలా భాషల్లోకి రీమేక్ అయ్యి, అన్ని భాషల్లోనూ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఓటిటిలో ఇలాంటి ఓ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా అందుబాటులో ఉంది. మరి మీకు కూడా ఈ జానర్ సినిమాలంటే ఇష్టమైతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీపై ఓ లుక్కేసి తీరాల్సిందే. మరి ఇంతకీ ఆ మూవీ పేరేంటి? ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళితే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు జానే జాన్. కరీనాకపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని ఇప్పటిదాకా చూడకపోతే తప్పకుండా ఓసారి చూసేయండి.

Jaane Jaan Movie Review: Give Jaideep Ahlawat Every Acting Award Out There  (& Indian Remake Of Joaquin Phoenix's Joker), Kareena Kapoor Khan  Surrenders To The Brilliance Of Sujoy Ghosh

- Advertisement -

మూవీ స్టోరీ ఏంటంటే…

సింగిల్ మదర్ గా జీవిస్తూ ఉంటుంది మాయ డిసౌజ. తన కూతురితో కలిసి నేపాల్ లో నివసిస్తూ ఉంటుంది. అక్కడ ఓ చిన్న రెస్టారెంట్ లో పని చేస్తుంది. ఇక ఆమె ఉండే ఇల్లు ఆ పక్కనే ఉంటుంది. స్కూల్ కూడా దగ్గర్లోనే ఉంటుంది. అయితే మాయ ఉండే ఫ్లాట్ పక్కనే నరేన్ వ్యాస్ అనే ఒక స్ట్రేంజ్ టీచర్ నివసిస్తూ ఉంటారు. చూడ్డానికి స్ట్రేంజ్ గానే ఉన్నప్పటికీ అతను మంచివాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అలాగే అతను బయట ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. పాఠశాలలో టీచర్ గా పని చేస్తూ, ఎక్కువగా స్కూల్లోనే ఉంటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. అతను మాయపై మనసు పడతాడు.

మరోవైపు మాయ ఎవరినీ పట్టించుకోకుండా తన కూతురిని చూసుకుంటూనే రెస్టారెంట్ లో జాబ్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 15 ఏళ్ల తర్వాత మాయ భర్త ఆమెను కలవడానికి నేపాల్ వస్తాడు. ఎందుకు వచ్చావు అని మాయ ప్రశ్నిస్తే తన కూతురును స్టార్ హీరోయిన్ చేస్తాను తనతో పంపించమనీ గొడవపడతాడు. అయితే మాయ ఒప్పుకోకపోవడంతో ఆ గొడవ పెద్దది అవుతుంది. కూతుర్ని అతని నుంచి కాపాడుకోవడానికి హీటర్ వైర్ ను అతని మెడకు చుట్టి తల్లి, కూతుర్లు ఇద్దరు కలిసి చంపేస్తారు. ఈ షాకింగ్ ఘటనను పక్కనే ఉన్న స్ట్రేంజ్ టీచర్ చూసేస్తాడు. అయితే అతను పోలీసులకు మాత్రం చెప్పడు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? ఆ హత్యను ఎలా కవర్ చేశారు? ఈ స్ట్రేంజ్ టీచర్ అసలు కథ ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే జానే జాన్ మూవీని చూసి తీరాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు