Shah Rukh Khan : వడ దెబ్బతో ఆసుపత్రిలో చేరిన షారుక్… ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటే?

Shah Rukh Khan : బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో ఆయన అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చేరారు. వేడిగాలుల కారణంగా ఆయన వడ దెబ్బకు బారిన పడ్డారని తెలుస్తోంది. దీంతో డీహైడ్రేషన్‌ కు గురయ్యాడు షారుక్. సమాచారం ప్రకారం షారుక్ బుధవారం మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య ఆసుపత్రిలో చేరారు.

అసలేం జరిగిందంటే?

డీహైడ్రేషన్ కారణంగా షారుఖ్ ఖాన్ మే 21న మంగళవారం అహ్మదాబాద్‌లోని కెడి ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఎస్‌ఆర్‌కే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కేడీ ఆస్పత్రి వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. షారుఖ్‌ డీహైడ్రేషన్‌తో బాధపడ్డాడు. మంగళవారం అహ్మదాబాద్‌లో కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ జట్ల మధ్య ప్లే ఆఫ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కోసం షారూక్ రెండు రోజుల క్రితం అహ్మదాబాద్ చేరుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత షారుక్కేకేఆర్ జట్టుతో అర్థరాత్రి అహ్మదాబాద్‌లోని ఐటీసీ నర్మదా హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది. అయితే ఉదయం అతని పరిస్థితి మరింత దిగజారడంతో షారుక్ ను మధ్యాహ్నం 1 గంటలకు కేడి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేశారు.

Shah Rukh Khan revitalizes his iconic Chak De India moment in KKR dressing room: 'Make sure they grow into…' | Crickit

- Advertisement -

షారుక్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, తగిన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కోరారు. దీంతో ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాగే షారుక్ ఈ ఎండల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.

హీట్ వేవ్ / వడ గాలులు అంటే ఏమిటి?

మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉష్ణోగ్రత 40 కంటే ఎక్కువ డిగ్రీలు ఉంటే దానిని హీట్ వేవ్ / వడ గాలులు అంటారు. హీట్ వేవ్ అంటే 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది. అలాంటి అధిక ఉష్ణోగ్రతలలో నివసించడం మానవ ఆరోగ్యానికి మంచిది కాదు.

ఈ సారి సమ్మర్ లో భారతదేశంలో ఎక్కడ చూసినా చాలా వేడిగానే ఉంది. ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం వరకు వేడి కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. తీవ్రమైన వేడి కారణంగా భారతదేశం అంతటా వేడిగాలులు వీస్తున్నాయి. ఈ వడగాల్పుల దెబ్బకు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ కూడా తప్పించుకోలేకపోయాడు.

భారత వాతావరణ శాఖ హెచ్చరిక

ఇప్పుడు ఇండియాలో ఏ మూలన చూసినా వేడిని తట్టుకోలేకపోతున్నారు సాధారణ ప్రజలు. పెరుగుతున్న కాలుష్యం, పలు వాతావరణ మార్పుల కార్ణాంగా ఈసారి సమ్మర్ మరింత హీటెక్కిస్తోంది. ఈ నేపథ్యంలోనే వడదెబ్బ తగలకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు భారత వాతావరణ శాఖ వారు.

తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వడ దెబ్బ తగిలితే చనిపోవడం లాంటి తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎండల్లో జాగ్రత్తగా ఉంటూ వాటర్ ఎక్కువగా తాగడం మంచిది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు