28 years for Intlo Illalu Vantintlo Priyuralu : 28 వసంతాల ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు.. వెంకటేష్ ఫుల్ మీల్స్ ఎంటర్టైన్మెంట్..

28 years for Intlo Illalu Vantintlo Priyuralu: టాలీవుడ్ లో కాంబినేషన్స్ పై మంచి క్రేజ్ ఉంటుంది. ఆ కాంబినేషన్ లో సినిమాలు రావాలని ప్రేక్షకులు కోరుకుంటారు. అలాంటి కాంబినేషన్ ఇవివి సత్యనారాయణ వెంకటేష్ ది. కానీ ఈ కాంబో లో రెండు సినిమాలు మాత్రమే వచ్చాయి. కానీ ఆ రెండూ గుర్తుండిపోయే మంచి సినిమాలు వచ్చాయి. కానీ ఈ ఆ తర్వాత ఈ కాంబో రిపీట్ అవ్వలేదు. నిజానికి వెంకటేశ్ కుటుంబ సభ్యుల ద్వారానే ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకునిగా మారారు. వీరి కాంబోలో వచ్చిన తొలి చిత్రం ‘అబ్బాయిగారు’. ఈ సినిమాకు తమిళంలో భాగ్యరాజా నటించి, రూపొందించిన ‘ఎంగ చిన్న రాజా’ చిత్రం ఆధారం. ఇక రెండో సినిమా ‘ఇంట్లో ఇల్లాలు – వంటింట్లో ప్రియురాలు’. ఈ చిత్రానికి కూడా భాగ్యరాజా కథతో తెరకెక్కిన ‘తాయ్ కులమే తాయ్ కులమే’ మూలం కావడం విశేషం! ఈ చిత్రాన్ని తెలుగులో ఇ.వి.వి. సత్యనారాయణ తనదైన పంథాలో మలిచి తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలై నేటికీ 28 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

28 years for Intlo Illalu Vantintlo Priyuralu Movie

ఇద్దరు భార్యల కథ నేపథ్యంలో..

ఇక ‘ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు’ కథ విషయానికి వస్తే… శ్రీరామ్, సీత అన్యోన్య దంపతులు. వారికి పిల్లలు ఉండరు. పరీక్ష చేయిస్తే, సీతలో లోపం ఉందని తేలుతుంది. అయితే భార్య మనోవేదనకు గురవుతుందని శ్రీరామ్, ఆ లోపమేదో తనలోనే ఉందని చెప్పుకుంటాడు. అనుకోకుండా బిజినెస్ పనిమీద నేపాల్ వెళ్ళిన శ్రీరామ్, అక్కడ మనీషా అనే అమ్మాయిని చూస్తాడు. ఆమెతో చనువుగా ఉంటే, అక్కడి ఆచారం ప్రకారం వారికి పెద్దలు ముందు బలవంతంగా పెళ్ళిచేస్తారు. కొన్ని నాటకీయపరిణామాల తర్వాత ఇద్దరూ ఒకటవుతారు. ఇక మనీషా కొడుకును కంటుంది. ఆ అబ్బాయిని శ్రీరామ్ తీసుకు వస్తాడు. తన బిడ్డను చూసుకోవడానికి మనీషా, శ్రీరామ్ ఇంట్లోనే వంట మనిషిగా చేరుతుంది. భార్యకు నిజం తెలిస్తే, ఆమె అనారోగ్య కారణంగా మరణిస్తుందేమోనని శ్రీరామ్ భయం. దాంతో నిజం చెప్పలేడు. చివరకు తనయుడు నిందలు పడుతూఉంటే, శ్రీరామ్ తండ్రి అసలు విషయం బయటపెడతాడు. క్లైమాక్స్ లో నిజానిజాలు పెళ్ళికి కారణం తెలుసుకున్న సీత మనీషను తన ఇంట్లోనే కోరడంతో కథ సుఖాంతమవుతుంది.

- Advertisement -

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఫుల్ మీల్స్..

ఇక ఈ సినిమాలో శ్రీరామ్ గా వెంకటేశ్, సీతగా సౌందర్య, మనీషాగా వినీత నటించారు. మిగిలిన కీలక పాత్రల్లో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబూమోహన్, ఏవీయస్, మల్లికార్జునరావు, మాస్టర్ అన్వేష్ కనిపించారు. శ్రీదుర్గా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రాన్ని కె.ఎల్.నారాయణ నిర్మించాడు. ఈ చిత్రంలోని ఏడు పాటలను సామవేదం షణ్ముఖ శర్మ రాయగా, కోటి సంగీతం సమకూర్చారు. ఇక “ప్రియురాలే ప్రేమగా…”, “చిలకతో మజా…”, “అమ్మనే అయ్యాను రా…” వంటి పాటలు ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించాయి. 1996 మే 22న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ రోజుల్లో ఏకంగా 25 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఈ చిత్ర వందరోజుల వేడుక కర్నూల్ లో వైభవంగా జరిగింది. ఇక ఈ సినిమా ఆ తర్వాత హిందీలో “ఘర్ వాలీ – బాహర్ వాలీ” పేరుతో అనిల్ కపూర్ హీరోగా రీమేక్ అయింది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సౌందర్య మూడో సారి జంటగా నటించగా, ఆ సినిమా తర్వాత వారి కాంబోకి మరింత క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత వెంకీ సౌందర్య కాంబోలో పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, రాజా, జయం మనదిరా వంటి సూపర్ హిట్స్ వచ్చాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు