Janhvi Kapoor – Sara Alikhan : బెస్ట్ ఫ్రెండ్స్ కదా.. అందుకే ఒకే నెంబర్ మెయింటైన్ చేస్తున్నారు?

Janhvi Kapoor – Sara Alikhan : బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ గా ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో జాన్వీ కపూర్, సారా అలీఖాన్ ముందుంటారు. జాన్వీ కపూర్ శ్రీదేవి బోణి కపూర్ ల కూతురిగా ఎంట్రీ ఇస్తే… సారా అలీఖాన్ హీరో సైఫ్ అలీఖాన్ గారాల కూతురిగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక అందం, అభినయం ఉన్న ఈ హీరోయిన్లు ఇద్దరూ తమదైన శైలిలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా జాన్వీకపూర్ – సారా అలీఖాన్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రు బాల్యం నుంచి స్నేహితులు. ఎంతో క్లోజ్ గా ఉంటారు. ఇండస్ట్రీ లో ఇప్పుడున్న హీరోయిన్లలో బెస్ట్ ప్రెండ్స్ ఎవ‌రంటే? వారిద్ద‌రు వారి పేర్లే చెబుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఒకే మంచం..ఒకే కంచం అన్నంత‌గా ఇద్దరూ మెలుగుతారని బాలీవుడ్ లో అంటుంటారు. ఇక సినిమాల్లోకి రావ‌డం ద‌గ్గ‌ర నుంచి స‌క్సెస్ అవ్వ‌డం ప్రతీది ఈక్వ‌ల్ అనేస్తారు. తాజాగా ఈ బ్యూటీలిద్ద‌రు ఇండ‌స్ట్రీలో ఎంత బిజీగా ఉన్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

Janhvi Kapoor Sara Alikhan Friendship

నెంబర్ కూడా ఒకేలా నెంబర్?

ఇక ‘ధ‌డ‌క్’ సినిమాతో జాన్వీ క‌పూర్ ఎంట్రీ ఇస్తే… ‘కేధ‌ర‌నాద్’ సినిమా తో సారా అలీఖాన్ గ్రాండ్ గా లాంచ్ అయ్యారు. మ‌రి వీరిద్ద‌రు ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్ని సినిమాలు చేసారంటే? లెక్కలు ఒకేలా ఉన్నాయి. మామూలుగా ఒక‌రు ఎక్కువ చేయ‌డానికి లేదా త‌క్కువ‌గా చేయ‌డానికి అవ‌కాశం ఉంటుంది. కానీ ఈ ప్రెండ్స్ ఆ ఛాన్స్ కూడా ఇవ్వ‌లేదు. ఇద్ద‌రు కూడా ఒకే నెంబ‌ర్ మెయింటెన్ చేసారు. జాన్వీ క‌పూర్ 13 సినిమాలు చేస్తే.. సారా అలీఖాన్ కూడా 13 సినిమాలే చేసింది. అలా ఈ స్నేహితురాళ్లు ఇద్ద‌రు ఒకే నెంబ‌ర్ ని మెయింటెన్ చేస్తున్నారు. మ‌రి యాదృశ్చికంగా జ‌రిగిందా? లేక అనుకునే చేస్తున్నారా? అన్న‌ది వాళ్ల‌కే తెలియాలి. ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్ నాలుగు సినిమాల‌తో బిజీగా ఉంది. అందులో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ‘దేవ‌ర’, కాగా మరొకటి రామ్ చరణ్ RC16. ఈ సినిమాలతో పాన్ ఇండియాలో లాంచ్ అవుతుంది. ఇక‌ సారా అలాఖాన్ మూడు సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంది. తెలుగులోనూ లాంచ్ అవ్వాల‌ని వెయిట్ చేస్తోంది. జాన్వీ క‌పూర్ ద్వారా ఇక్క‌డి అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

ఇండస్ట్రీ లో బెస్ట్ ఫ్రెండ్స్..

ఇక సారా అలీఖాన్ బాలీవుడ్ లో మాత్రం ఇటీవ‌లే మ‌రో రెండు సినిమాల‌కు సైన్ చేసిన‌ట్లు మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. ఓ సినిమాలో సాహ‌సోపేత‌మైన పాత్ర కూడా పోషిస్తుంద‌ని వినిపిస్తుంది. ఇంత‌వ‌ర‌కూ అలాంటి పాత్ర‌ను ఏ న‌టి పోషించ‌లేద‌ని ప్ర‌చారం సాగుతోంది. కానీ ఆ సినిమా వివ‌రాలు మాత్రం గోప్యంగా ఉన్నాయి. అలాగే అన్ని అనుకూలిస్తే స్నేహితులిద్ద‌రు ఒకే ఇంటికి తోడికోడ‌ళ్ల‌ గానూ వెళ్లినా ఆశ్చర్యం లేదని అంటున్నారు బాలీవుడ్ వర్గాలు. ఇక వీరిద్దరూ కలిసి సినిమాలు పెద్దగా చేయకపోయినా, ఆఫ్ లైన్ లో మాత్రం అక్కా చెల్లెళ్ళ రేంజ్ (Janhvi Kapoor – Sara Alikhan) లో కలిసి ఉంటారు. ఇక త్వరలోనే వీరి కాంబోలో సినిమా తీయాలని చూస్తున్నారు బాలీవుడ్ నిర్మాతలు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు