10 Year’s for Manam: అప్పట్లోనే ఎంత కలెక్షన్స్ వసూల్ చేసిందో తెలుసా..?

10 Year’s for Manam.. సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ ఫ్యామిలీ చేయని ప్రయోగం అక్కినేని ఫ్యామిలీ చేసి సక్సెస్ అయిందని చెప్పాలి.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మాణంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం మనం.. అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య, సమంత , శ్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రమిది.. అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి చిత్రం కూడా ఇదే.. అలాగే ఈ సినిమాలో అఖిల్ కూడా కీలకపాత్ర పోషించారు. ఎవరు ఊహించకుండా ఎటువంటి అంచనాలు లేకుండా 2014 మే 23న విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా ఫీల్ ఫ్రెష్ గానే అనిపిస్తూ ఉంటుంది. చూసిన ప్రతిసారి మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. అంతేకాదు అప్పుడప్పుడు బుల్లితెరపై ప్రసారమైతే మాత్రం భారీ టీఆర్పీ రేటింగ్ను సొంతం చేసుకుంటుందనటంలో సందేహం లేదు.. క్లాసిక్ మూవీ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం ప్లస్ అయిందని చెప్పాలి.. ఇందులో పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇంకా ఈ సినిమా విడుదలై నేటికీ 10 సంవత్సరాలు కావస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఈ సినిమాపై ఎక్కువ ట్వీట్లు వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ సినిమా అప్పట్లోనే ఎంత కలెక్షన్స్ వసూలు చేసిందో ఇప్పుడు చూద్దాం..

10 Year's for Manam: Do you know how much collections were collected then..?
10 Year’s for Manam: Do you know how much collections were collected then..?

మనం మూవీ కలెక్షన్స్..

నైజాం – రూ.11.20 కోట్లు

- Advertisement -

సీడెడ్ – రూ.03.90 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ.03.30 కోట్లు

ఈస్ట్ – రూ.02.10 కోట్లు

వెస్ట్ – రూ.01.50 కోట్లు

గుంటూరు – రూ.02.25 కోట్లు

కృష్ణ – రూ.02.00 కోట్లు

నెల్లూరు – రూ.01.00 కోట్లు

ఏపీ + తెలంగాణ – రూ.27.25 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ.03.00 కోట్లు

ఓవర్సీస్ – రూ.06.40 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా రూ.36.65 కోట్లు

మనం చిత్రానికి రూ.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగగా ..ఫుల్ రన్ ముగిసే సరికి ఈ సినిమా రూ.36.65 కోట్ల షేర్ ను రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది.. ముఖ్యంగా బయ్యర్లకు ఈ సినిమా రూ .18.65 కోట్ల లాభాలను అందించింది. నాగార్జునకు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందించడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు..

బడా ఫ్యామిలీల ప్రయత్నం ఫలించలేదా..

ఇక ఈ సినిమా తర్వాత చాలామంది ఫ్యామిలీలు ఇలాంటి సినిమాని తీయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు ..కానీ ఈ రేంజ్ లో అయితే ఇంకా తెరపైకి రాలేదని చెప్పాలి.. ముఖ్యంగా దగ్గుబాటి ఫ్యామిలీ ఇలాంటి సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇంకా ఈ సినిమా ప్రాజెక్ట్ గురించి వారు ప్రకటించలేదు.. మొత్తానికి అయితే మనం సినిమా కల్ట్ క్లాసికల్ గా మిగిలి భారీ విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు.. ఇక ఈ ఫ్యామిలీ మొత్తం ఈ సినిమాలో అద్భుతంగా నటించి భారీ ఇమేజ్ సొంతం చేసుకుంది. మరోవైపు అక్కినేని నాగేశ్వరరావుకు ఇదే చివరి సినిమా కావడం గమనార్హం .. ఈ సినిమా తర్వాత కొద్ది రోజులకి ఆయన క్యాన్సర్ మహమ్మారితో పోరాడి స్వర్గస్తులయ్యారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు