Ravi Teja Movie: అటు ఇటు తిరిగి రాశి ఖన్నా దగ్గరికి వచ్చిన రవితేజ?

మాస్ మహారాజా రవితేజ, తనకు డాన్ శ్రీను, బలుపు, క్రాక్ వంటి సినిమాలు ఇచ్చిన గోపిచంద్ మలినేనితో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫోటో షూట్ ను నిర్వహించి, సినిమా అనౌన్స్ చేశారు. అలాగే ఫోటోలను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా అనౌన్స్ సమయంలో హీరోయిన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రవితేజ సినిమాకు హీరోయిన్ దొరకడం లేదు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నిజానికి ఈ సినిమాకు మొదట నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను తీసుకున్నారు. కాంట్రాక్ట్ కూడా అయిపోయింది. కానీ మైత్రీ మూవీ మేకర్స్ తో ఉన్న విబేధాల కారణంగా రష్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. తర్వాత ఇండస్ట్రీలో బేబమ్మగా పేరున్న క్రుతి శెట్టిని కూడా సంప్రదించారు. డైరెక్టర్ ఈ సినిమా ఎలాంటి గ్యాప్ లేకుండా తక్కువ డేట్స్ లోనే షూటింగ్ పూర్తి చేయాలనుకున్నాడు. దీంతో తనకు ఇప్పటికే ఉన్న సినిమాల డేట్స్ కి ఈ సినిమా డేట్స్ క్లాష్ అవుతాయని క్రుతి కూడా తప్పుకుంది.
ఇప్పుడు చిత్ర యూనిట్ మరో హీరోయిన్ ని సెర్చ్ చేస్తున్నారు. తాజాగా వస్తున్న సమాచారం… ఈ చిత్ర యూనిట్ రాశీ ఖన్నాను సంప్రదిస్తున్నారట. ఇప్పటికే స్టోరీని చెప్పారట. అలాగే డేట్స్ గురించి క్లారిటీ వస్తే… రాశీ ఖన్నాను సినిమాలో ఫైనల్ చేసే అవకాశం ఉంది. కాగా, రాశీ ఖన్నాకు గత కొన్ని రోజుల నుంచి అవకాశాలు రావడం లేదు. ఒక వేళ ఈ సినిమా ఫైనల్ అయితే, రాశీ ఖన్నాకు కూడా ఓ బంబర్ ఆఫర్ అయినట్టే.
Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు