Rashi kanna:రాశిఖన్నాని వాడుకొని మరీ టాలీవుడ్ లో మోసం చేసింది ఎవరు..!

టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న రాశిఖన్నా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. మనం సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత రాశిఖన్నాకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

తక్కువ సమయంలోనే రాశిఖన్నా మంచి ఆఫర్స్ ని అందుకుంది. తెలుగులో దాదాపు యంగ్ హీరోలు అందరితో కలిసి నటించింది ఈ చిన్నది. అయితే రాశిఖన్నాకు పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు మాత్రం రావడం లేదు. ఈ బ్యూటీ కొంతకాలంగా తెలుగులో సినిమాలు చేయడాన్ని తగ్గించేసింది. గతేడాది పక్కా కమర్షియల్, థాంక్యూ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చినప్పటికీ ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు.

అయితే కొందరు నిర్మాతలు రాశిఖన్నా కి ఆఫర్స్ ఇస్తామని మోసం చేసి మరో హీరోయిన్ కి కట్టబెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇండస్ట్రీ లోకి కొత్తగా ఏ హీరోయిన్ వచ్చినా రాశిఖన్నాకి గండి కొట్టినంత పని చేసినట్టయింది. చాలా సినిమాలు రాశి చేతి నుండి జారిపోయాయి. వాడుకున్నన్ని రోజులు వాడుకున్న నిర్మాతలు ఈమెకి మొండి చేయి చూపించారట. ఓ దశలో హీరోలు సైతం ఈ అమ్మడిని లైట్ తీసుకున్నారని లోలోపల మదన పడిందట. కానీ ఇలాంటి బ్యూటీ పూరీ జగన్నాథ్ లాంటి దర్శకుల చేతిలో పడితే కెరీర్ అమాంతం పెరిగిపోతుంది

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు