Raashi Khanna Marriage: పెళ్లికి రెడీ అయిన రాశిఖన్నా.. వరుడు అతడేనంట..?

Raashi khanna Marriage

రాశిఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. హిందీ చిత్రం మద్రాస్ కెఫే అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించిన రాశిఖన్నా.. ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో మొదటిసారి హీరోయిన్ గా టాలీవుడ్ రంగానికి పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది రాశిఖన్నా. ఈ సినిమాకి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. నాగశౌర్య హీరోగా చేశారు. ఇక ఈ సినిమా తరువాత సుప్రీమ్, హైపర్ వంటి సినిమాలతో రాశిఖన్నా రేంజ్ మారిపోయింది.

అనతికాలంలోనే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ భాషల్లో కూడా సినిమాలు చేసింది. అయితే ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పకనే చెప్పేసింది రాశిఖన్నా. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈమధ్య ఒక అబ్బాయిని ప్రేమించి బ్రేకప్ అయ్యానని.. ఆ తరువాత డిప్రెషన్ కి వెళ్లడంతో బరువు పెరిగానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా కొద్ది రోజులకే మరో వ్యక్తి పరిచయం అయ్యాడని తెలిపింది.

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారిందని.. ఇప్పుడు ఇద్దరం డేటింగ్ లో ఉన్నామని తెలిపింది. దీంతో రాశిఖన్నా తొందరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ విషయం వాళ్ళ ఇంట్లో చెప్పడంతో వారు కూడా ఒప్పుకున్నట్లుగా న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి ఇండస్ట్రీకి చెందిన వాడా..? లేక బయటి వ్యక్తా..? అనే విషయాన్ని రాశి ఖన్నా ప్రకటించలేదు. దీంతో రాశిఖన్నాని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరా..? అంటూ తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజెన్లు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు