Mass Maharaj Ravi Teja : టైగర్ నాగేశ్వర రావు టీజర్ అప్డేట్

Tiger Nageswara Rao latest update

మాస్ మహా రాజ్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమా టైగర్ నాగేశ్వర రావు గురించి అందరికి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి టీజర్ అప్డేట్ ను కాసేపటి క్రితం ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది మూవీ యూనిట్.

అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన నుపూర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వర రావు సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది. జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 20న విడుదల చేయనున్నారు.

గతంలో ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా ఈ సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రివీల్ చేయనున్నట్టు మూవీ టీం ప్రకటించింది. సువర్ట్ పురం దొంగ గా పేరుగాంచిన టైగర్ నాగేశ్వర రావు జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను అన్ని భాషల్లోనూ గ్రాండ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలనే రవితేజ నటించిన రావణాసుర సినిమా ఫ్లాప్ అవడంతో, టైగర్ నాగేశ్వర రావు సినిమాతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని రవితేజ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు