Srikanth odela next movie: దసరా డైరెక్టర్ కు బంపర్ ఆఫర్

ఇటీవలనే నాని హీరోగా వచ్చిన దసరా సినిమాతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమై, మొదటి సినిమానే తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల తన రెండవ సినిమాకె జాక్ పాట్ కొట్టేసాడనే న్యూస్ ప్రస్తుతం ఫిలిం నగర్ లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర రంగస్థలం సినిమాకు గాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన శ్రీకాంత్ ఓదెల ఈ ఏడాది వచ్చిన దసరా సినిమాతో టాలీవుడ్ కూడా దర్శకుడిగా పరిచయమయ్యాడు. మొదటి సినిమానే పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు దసరా నాని కెరీర్ లోనే 100 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి సినిమా రికార్డ్ కూడా క్రియేట్ చేసింది.

దసరా సినిమా రిలీజై 4 నెలలు కావొస్తున్నా ఈ దర్శకుడు నెక్స్ట్ సినిమాపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. మొన్నటి వరకు అఖిల్ అక్కినేని తో సినిమా చేయబోతున్నాడని వార్తలు రాగా అవి కేవలం రూమర్స్ అని తేలిపోయాయి. అలాగే ఇటీవలనే హీరో నాని కె శ్రీకాంత్ ఓదెల మరో కథ వినిపించాడని కూడా కథనాలు వచ్చాయి. నాని ప్రస్తుతం చేస్తున్న హాయ్ నాన్న సినిమా తరువాత వీరి సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుందని న్యూస్ వైరల్ అయింది. అయితే ఈ రూమర్స్ అన్నిటికి చెక్ పెడుతున్నాడు ప్రస్తుతం ఈ యువ దర్శకుడి రెండవ సినిమా లేటెస్ట్ వార్త ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది.

- Advertisement -

ఆ వార్త ఏంటంటే.. శ్రీకాంత్ ఓదెల త్వరలోనే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను హీరోగా లాంచ్ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. నిజానికి నందమూరి మోక్షజ్ఞ నుఆదిత్య 369 కు సీక్వెల్ తో బాలకృష్ణనే తానే స్వీయ దర్శకత్వం వహించి లాంచ్ చేస్తాడని పలు సార్లు బాలకృష్ణ స్యయంగా చెప్పారు. కానీ ప్రస్తుతం ఆయనకు డైరెక్షన్ మీద ఆసక్తి లేకపోవడం ఆ బాధ్యత యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కు ఇచ్చినట్టు తెలుస్తోంది. తొందర్లోనే ఈ విషయంపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా రాబోతుందని టాక్.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు