Chiranjeevi : భోళాతో చిరంజీవిలో భారీ మార్పు

Chiranjeevi latest movie update

భోళా శంకర్ సినిమాతో మెగా స్టార్ చిరంజీవిలో భారీ మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. రీమేక్ సినిమాలు చేస్తే తప్పేంటని నిన్న, మొన్నటిదాకా ప్రగల్భాలు పలికిన మెగా స్టార్ ఒక్కసారిగా భోళా శంకర్ రిజల్ట్ తో ప్రస్తుతం జాగ్రత్త పడుతున్నట్టు ఫిలిం నగర్ లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ సినిమా ఆగస్ట్ 11న రిలీజైన సంగతి తెలిసిందే. తమిళ్ లో అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమా రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ ను అందుకుంటుంది. మెగా ఫ్యాన్స్ లో కొంతమంది వరకు భోళా శంకర్ సినిమా విషయంలో కాస్త పాజిటివ్ గానే ఉన్నకూడా భారీగా వస్తున్న నెగిటివిటీ ముందు భోళా శంకర్ కు వ్యతిరేకత తప్పట్లేదు. ముందు నుంచే చిరంజీవి రీమేక్ లపై అసంతృప్తిగా ఉంటున్న మెగా ఫ్యాన్స్ కు భోళా శంకర్ సినిమా వాళ్ళ ఓపిక ను పరీక్షించినట్టైంది. దాంతో ఇక మెగా స్టార్ చిరంజీవి కూడా ప్రస్తుతం చేయబోతున్న సినిమాల విషయంలో శ్రద్ద వహిస్తున్నట్టు తెలుస్తోంది.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్టైన బ్రో డాడీ సినిమాకు రీమేక్ అని కొద్దీ రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవలనే ఈ సినిమా రీమేక్ రైట్స్ కొణిదెల ప్రొడక్షన్స్ కొనుగోలు కూడా చేసింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా, భోళా శంకర్ సినిమా బెడిసి కొట్టేసరికి, బ్రో డాడీ రీమేక్ ను మెగా స్టార్ క్యాన్సిల్ చేసినట్టు సమాచారం అందుతోంది. అలాగే ఇక నుంచి రీమేక్ సినిమాలు చేయకూడదని కూడా ఆయన నిర్ణయించుకున్నాడట. ఎంత సమయం అయిన తీసుకొని స్ట్రయిట్ సినిమాలు చేయడానికే ఆయన రెడీ అయ్యాడని ఇన్సైడ్ టాక్. కళ్యాణ్ కృష్ణ సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి మల్లిడి వశిష్ఠ తో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు