Latest viral news : జైలర్ లో ఆ క్యారెక్టర్ బాలయ్య చేయాల్సిందట ?

NBK cameo in jailer

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా జైలర్ ఆగస్ట్ 10న రిలీజై, ప్రస్తుతం థియేటర్స్ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రకు గాను నందమయూరి బాలకృష్ణ నటించాల్సి ఉండేదట కానీ కొన్ని కారణాల వల్ల అలా జరగలేదని డైరెక్టర్ నెల్సన్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలనే నెల్సన్ తెరకెక్కించిన జైలర్ సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. డార్క్ కామెడీ సినిమాలు తీయడంలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ నెల్సన్ జైలర్ సినిమాను అదే తరహాలో జైలర్ సినిమాను కూడా తెరకెక్కించాడు. రమ్య కృష్ణ , తమన్నా, సునీల్, మిర్న మీనన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో ప్రముఖ మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, అలాగే కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ గెస్ట్ అప్పియరెన్స్ గా రెండు కీలక పాత్రలలో కనిపించారు.

జైలర్ సినిమా మొత్తంలో గెస్ట్ అప్పియరెన్స్ గా కనిపించిన శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ పాత్రలకు థియేటర్స్ లో ప్రేక్షకుల నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లతో పాటు టాలీవుడ్ నుంచి కూడా మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి బాలకృష్ణ తో ఒక గెస్ట్ అప్పియరెన్స్ రోల్ చేయిద్దామని డైరెక్టర్ నెల్సన్ అనుకున్నాడట… కానీ ఆయన బాలకృష్ణ పోర్షన్ ఆయన సరిగా రాయలేకపోవడంతో బాలకృష్ణ గారు జైలర్ సినిమాలో చేయడం కుదరలేదు అని నెల్సన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేసాడు. దాంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్య కూడా జైలర్ సినిమాలో చేసి ఉంటె బాగుండేదని సోషల్ మీడియా యువత పోస్ట్ లు వేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు