Prabhas and Maruthi Movie: సర్జరీ అయితేనే డార్లింగ్ డ్యాన్స్?

Prabhas and Maruthi Movie

నిజాలు మాట్లాడుకోవాలంటే, డార్లింగ్ ప్రభాస్ పెద్ద డ్యాన్సర్ ఏం కాదు. కానీ, బాహుబలికి ముందు డార్లింగ్ ప్రభాస్ డ్యాన్స్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. చిన్నగా కాలు కదిపినా, విజిల్స్ పడేవి. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ డ్యాన్స్ చేసిన సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ. దీనికి కారణం బాహుబలినే అని చెప్పొచ్చు.

ఈ సినిమా సమయంలో యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు మోకాలి గాయం అయ్యాంది. దీనికి ఇప్పుడు కూడా ప్రభాస్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. అయినా, పెద్దగా ఫలితం అయితే రాలేదు. ఇటీవల ఆదిపురుష్ టీజర్ ఈవెంట్‌లో డైరెక్టర్, హీరోయిన్ సాయంతో నడిచిన వీడియో వైరల్ అయింది. అది కాస్త డార్లింగ్ ఫ్యాన్స్‌ని అయోమయంలోకి నెట్టింది. తర్వాత ప్రభాస్ స్టిక్ సాయం లేకుండా నడవడం కష్టమే అంటూ న్యూస్ కూడా వచ్చింది.

అయితే ఇప్పుడు మారుతితో చేస్తున్న సినిమాలో కనీసం 5 పాటలు ఉండబోతున్నాయట. దీనిలో డార్లింగ్ తప్పకుండా డ్యాన్స్ చేయాల్సి ఉంటుందట. ఇప్పుడు ప్రభాస్‌కి ఉన్న మోకాలి నొప్పి వల్ల డ్యాన్స్ చేయడం కష్టం. అందుకే మోకాలి నొప్పిని పూర్తి ఉపశమనం కోసం సర్జరీ చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాడట. అందుకోసం మూవీ షూటింగ్‌కి కూడా ఫుల్‌స్టాప్ పెట్టారని టాక్.

- Advertisement -

సలార్, ప్రాజెక్ట్ కె షూటింగ్స్ తర్వాత విదేశాల్లో ప్రభాస్‌కి సర్జరీ ఉంటుందని తెలుస్తోంది. ఈ సర్జరీ తర్వాతనే మారుతి సినిమా రీస్టార్ట్ అవుతుందని తెలుస్తోంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు