Bhola Shankar talk : భోళా శంకర్ సినిమాపై వస్తోన్న నెగిటివిటీకి కారణం ఎవరు ?

Bhola Shankar talkies talk

మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భోళా శంకర్ సినిమాకు ప్రేక్షకుల నుంచి తీవ్రంగా నెగిటివిటీ వస్తోన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ నెగిటివిటీ కారణం డైరెక్టర్ మెహర్ రమేష్ ఆ ? చిరంజీవి నా ? అని సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ జరుగుతుంది.

ఏకే ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించిన  భోళా శంకర్ సినిమా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వేదాళం రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాపై నిజానికి షూటింగ్ ప్రారంభమైన రోజు నుంచే మెగా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో తీవ్ర అసంతుప్తి మొదలైంది. దానికి కారణం చిరంజీవి వరుసగా రీమేక్ సినిమాలకు ఒకే చెప్పడమే. ఇక దానికి తోడు పదేళ్లుగా డైరెక్షన్ కు దూరంగా ఉన్న మెహర్ రమేష్ ఈ సినిమాను రూపొందించడం. అయితే ప్రేక్షకుల విమర్శలేవి పట్టించుకోకుండా మొత్తానికి సినిమా షూటింగ్ ఐతే కంప్లిట్ చేసారు మేకర్స్.

ఆ తరువాత భోళా శంకర్ సినిమాకు సంబంధించి ఒక్కొక్క అప్డేట్ ఇవ్వడం స్టార్ట్ చేసారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్స్ మినహా ఏది కూడా ప్రేక్షకులను ఎగ్జైట్ చేయలేదనే చెప్పాలి. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ అందించిన పాటల్లో ఒక్కటి కూడా పెద్దగా హిట్ అయింది లేదు. ఇక సినిమా విషయానికొస్తే ఆకట్టుకునే డైలాగులు లేవు, అబ్బుర పరిచే ఫైట్స్ లేవు , వినసొంపుగా ఉండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు. ఇవన్నీ లేవు సరే పోనీ కథ ఏమైనా కొత్తగా ఉందా అది కూడా లేదు. ఎప్పుడో 90స్ వచ్చిన ఆల్రెడీ చూసేసిన సినిమా కథలాగే భోళా శంకర్ సినిమా ఉండింది. వీటన్నిటికీ మించి చిరంజీవి ఉన్నాడని అనవసరమైన హంగులు, ఆర్భాటాలు చేయడం సినిమాకు మేజర్ కు మైనస్ అయ్యాయి.

- Advertisement -

అయితే ఇవన్నీ కేవలం డైరెక్టర్ తప్పేనా అంటే.. అవును డైరెక్టర్ తప్పే అంటున్నారు సో కాల్డ్ సోషల్ మీడియా యువత. సినిమా హిట్ అయితే హీరో అకౌంట్ లో, ఫ్లాప్ అయితే డైరక్టర్ అకౌంట్ లో వేసే ఈ రోజుల్లో డైరెక్టర్ మెహర్ రమేష్ ను స్థాయికి మించి విమర్శిస్తున్నారు. మరీ ఇది ఏ రకమైన విజ్ఞతనో వారికే తెలియాలి. చివరగా చెప్పేదేంటంటే ఒక సినిమా అనేది ఒక టీం ఎఫర్ట్ అయితే .. ఆ ఫ్లాప్ కూడా టీం అందరిదీ అవుతుంది అంతేకాని డైరెక్టర్ ఒకడిది అవ్వదు.. ఈ విషయాన్ని పలువురు గుర్తిస్తే సినిమాకు శుభం కలుగుతుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు